Nizamabad: డబుల్ బిల్లింగ్‌కు ఆస్కారమే లేదు: వేముల ప్రశాంత్‌రెడ్డి

మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తోన్న బాల్కొండ నియోజకవర్గంలో ఒకే పనికి రెండు విధాలుగా బిల్లులు డ్రా చేసుకున్నారని నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై తాజాగా మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్పందించారు.

Updated : 17 Jul 2023 15:55 IST

హైదరాబద్: హైదరాబద్: మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తు్న్న బాల్కొండ నియోజకవర్గంలో ఒకే పనికి రెండు విధాలుగా బిల్లులు డ్రా చేసుకున్నారని నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై తాజాగా మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్పందించారు. మంత్రి మాట్లాడుతూ.. ‘‘డబుల్ బిల్లింగ్‌కు ఆస్కారమే లేదు. నిధులు పక్కదారి పట్టలేదు. ఆరోపణలపై సీబీఐతో విచారణ చేసుకోవచ్చు’’ అని మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

కేటీఆర్.. రాహుల్‌ని విమర్శించే స్థాయి మీకుందా?: పొంగులేటి

నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ పెద్దవాగుపై నిర్మించిన హైలెవెల్‌ వంతెన శిలాఫలకం వద్ద ఆదివారం ఎంపీ అర్వింద్ విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడిన సంగతి తెలిసిందే. హైలెవెల్‌ వంతెనకు ఆర్‌డీసీ (రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) కింద రూ.15 కోట్లు డ్రా చేసిన తరువాత మళ్లీ స్పెషల్‌ అసిస్టెన్స్‌ ఫండ్‌ ద్వారా నిధులు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. ‘‘ రాష్ట్రాల నుంచి పన్నుల రూపేణా వచ్చే నిధులతో సంబంధం లేకుండా కేంద్రం వడ్డీ లేకుండా 50 ఏళ్ల వరకు స్పెషల్‌ అసిస్టెన్స్‌ ఫండ్‌ నుంచి రుణాలు మంజూరు చేస్తుంది. వీటి వివరాల కోసం నేను కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్‌ చౌదరికి లేఖ రాయగా పంపారు. ఈ మేరకు గత నాలుగేళ్లలో తెలంగాణకు రూ.5,221 కోట్లు కేటాయించింది. అందులో నిజామాబాద్‌ జిల్లాకు రూ.317.72 కోట్లు వచ్చాయి. ఈ నిధులతో జిల్లాలో మొత్తం 51 అభివృద్ధి పనులు చేపట్టగా ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే 33 జరిగాయి. వాటికి డబుల్‌ బిల్లింగ్‌ చేసి 125శాతం అధికంగా కమీషన్లు పొందారు’’ అని అర్వింద్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని