Janasena: ఇంటింటి సమాచారం తేవాలని వాలంటీర్లకు ఎవరు చెప్పారు?: నాదెండ్ల మనోహర్‌

రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యపై సీఎం జగన్‌ ఏనాడైనా మాట్లాడారా? అని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రశ్నించారు.

Updated : 19 Feb 2024 15:56 IST

మంగళగిరి: రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యపై సీఎం జగన్‌ ఏనాడైనా మాట్లాడారా? అని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రశ్నించారు. ఉపాధి అవకాశాలు లేక యువత ఇబ్బందిపడుతుంటే వైకాపా ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోందన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నాదెండ్ల మాట్లాడారు.

‘‘వాలంటీర్‌ వ్యవస్థను వైకాపా వ్యవస్థగా చెబుతున్నారు. దీని గురించి పవన్‌ మాట్లాడిన విషయాలపై కేసు నమోదు చేశారు. వారి కోసం ఏటా రూ.1,560 కోట్లు ఖర్చు చేస్తున్నారు. దానిలో రూ.617 కోట్లు డేటా సేకరణ కోసం కేటాయించారు. ఇంటింటి సమాచారం తేవాలని వారికి ఎవరు చెప్పారు?ఈ వ్యవస్థకు చట్టపరమైన గుర్తింపు ఉందా?అలా సేకరించిన సమాచారాన్ని ఎక్కడ భద్రపరుస్తున్నారు? వీటికి సమాధానం చెప్పకుండా మంత్రులు, పోలీసులు ఎదురుదాడికి దిగుతున్నారు. వాలంటీర్లపై జనసేన పార్టీకి ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదు’’ అని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని