AP News: మంత్రి అంబటి ఇంటిని ముట్టడించిన యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు

జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో వైకాపా ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ఏపీ యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు (NSUI) ఆరోపించారు.

Updated : 16 Feb 2024 16:06 IST

సత్తెనపల్లి: జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో వైకాపా ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ఏపీ యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు (NSUI) ఆరోపించారు. శుక్రవారం ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని మంత్రి అంబటి రాంబాబు నివాసాన్ని ముట్టడించారు. ఇంటి ముందు బైఠాయించి ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. మెగా డీఎస్సీ కాదు, దగా డీఎస్సీ అంటూ నినాదాలు చేశారు. 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఇచ్చిన హామీని జగన్‌ గాలికొదిలేశారని విమర్శించారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయటానికి ప్రభుత్వం సిద్ధమా?అని ప్రశ్నించారు. బై బై జగన్ రెడ్డి , బై బై వైసీపీ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని