Pawan Kalyan: అంజూయాదవ్‌పై చర్యలు తీసుకోండి.. శ్రీకాళహస్తి సీఐపై ఎస్పీకి పవన్‌ ఫిర్యాదు

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తిరుపతి చేరుకున్నారు. శ్రీకాళహస్తి సీఐ అంజుయాదవ్‌పై తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డికి ఆయన ఫిర్యాదు చేశారు.

Updated : 17 Jul 2023 18:01 IST

తిరుపతి: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తిరుపతి చేరుకున్నారు. శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్‌పై తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డికి ఆయన ఫిర్యాదు చేశారు. తొలుత గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంట చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి తిరుపతికి వచ్చారు. జనసేన కార్యకర్తలతో కలిసి భారీగా ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని అక్కడ వినతిపత్రం అందజేశారు. 

వివాదాస్పద అధికారిణిపై చర్యలేవీ?

ఇటీవల శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడు కొట్టే సాయిపై సీఐ అంజూయాదవ్‌ చేయిచేసుకున్నారు. దీన్ని జనసైనికులు తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలోనే పవన్‌ తిరుపతి చేరుకుని జిల్లా ఎస్పీని కలిసి సీఐపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

మచిలీపట్నం సభలో జనసైనికుల క్రమశిక్షణ చూశాం: పవన్‌

శ్రీకాళహస్తిలో జనసైనికులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే సీఐ చేయిచేసుకున్నారని పవన్‌ అన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘ఈ ఘటనపై సుమోటోగా కేసు తీసుకున్నందుకు హెచ్‌ఆర్సీకి ధన్యవాదాలు. మచిలీపట్నం సభకు ఎంతమంది జనసైనికులు వచ్చారో చూశారు. వారి క్రమశిక్షణ ఆ సభలో చూశాం. మచిలీపట్నం సభలో ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగలేదు. శ్రీకాళహస్తిలో సీఐ వ్యవహరించిన తీరుపై ఎస్పీకి ఫిర్యాదు చేశాం’’ అని పవన్‌ తెలిపారు.

తొడగొడుతూ.. వికటాట్టహాసం చేస్తూ.. సీఐ అంజూయాదవ్‌ మరో వీడియో వైరల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని