తొలి హామీని ఆప్‌ నెరవేర్చింది.. మేం ఇతర పార్టీల్లా కాదు: కేజ్రీవాల్‌

ఆప్‌.. ఏం చెబుతుందో అదే చేస్తుంది. ఇతర పార్టీల్లా నకిలీ హామీలు ఇవ్వదు’’ అని పేర్కొన్నారు. ప్రజలకు ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేయాలన్న....

Published : 17 Apr 2022 02:11 IST

దిల్లీ: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ప్రజలకు తొలిసారి ఇచ్చిన ఉచిత విద్యుత్‌ హామీని ఆప్‌ నెరవేర్చిందని ఆ పార్టీ జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. తాము ఇతర పార్టీల్లా నకిలీ హామీలు ఇవ్వబోమన్నారు. రాష్ట్రంలో అవినీతిని అంతమొందించడం ద్వారా పంజాబ్‌ ప్రభుత్వం డబ్బును ఆదా చేస్తందనీ.. తద్వారా రాష్ట్రాన్ని ప్రగతిపథంలో తీసుకెళ్తుందని తెలిపారు. జులై 1 నుంచి పంజాబ్‌లో ప్రతి ఇంటికీ నెలకు 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేయనున్నట్టు శనివారం ఉదయం పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ ప్రకటనపై ట్విటర్‌లో హర్షం ప్రకటించారు. 

‘‘ఆప్‌.. ఏం చెబుతుందో అదే చేస్తుంది. ఇతర పార్టీల్లా నకిలీ హామీలు ఇవ్వదు’’ అని పేర్కొన్నారు. ప్రజలకు ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేయాలన్న భగవంత్‌ మాన్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తున్నట్టు తెలిపారు. పంజాబ్‌లో స్పష్టమైన ఉద్దేశంతో నిజాయతీ, దేశభక్తి కలిగిన ప్రభుత్వం ఏర్పడిందన్న కేజ్రీవాల్‌.. రాష్ట్రాన్ని ప్రగతి మార్గంలో నడిపించేందుకు నిధుల కొరత రానివ్వబోమన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని