Vikas Bansode: భాజపాలో చేరిన ప్రముఖ లాయర్‌ వికాస్‌ బన్సోడే

సుప్రీంకోర్టు న్యాయవాది, పలు రాష్ట్రాల గవర్నర్లకు న్యాయ సలహాదారుగా పనిచేసిన వికాస్‌ బన్సోడే(Vikas Bansode) భాజపాలో చేరారు.

Published : 14 Nov 2022 01:07 IST

దిల్లీ: సుప్రీంకోర్టు న్యాయవాది, పలు రాష్ట్రాల గవర్నర్లకు న్యాయ సలహాదారుగా పనిచేసిన వికాస్‌ బన్సోడే(Vikas Bansode) భాజపాలో చేరారు. దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సి.టి.రవి సమక్షంలో కమల దళంలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కండువా కప్పి ప్రాథమిక సభ్యత్వాన్ని రవి అందజేశారు. అనంతరం సి.టి.రవి మాట్లాడుతూ.. బన్సోడే పలువురు గవర్నర్లకు న్యాయ సలహాదారుగా పనిచేశారన్నారు. కర్ణాటక మాజీ గవర్నర్‌ దివంగత కాంగ్రెస్‌ నేత హన్ష్‌రాజ్‌ భరద్వాజ్‌తో పాటు కేరళ, ఏపీ, తెలంగాణ గవర్నర్లకు లీగల్‌ సహదారుగా పనిచేశారని వివరించారు. ఆయనకు చాలా మంది ప్రతిపక్ష నేతల గురించి తెలుసనీ.. అందుకే భాజపాలో చేరాలన్న వికాస్‌ బన్సోడే నిర్ణయంతో వారిలో అనేకమందికి నిద్ర పట్టడంలేదని వ్యాఖ్యానించారు. బన్సోడే చేరికతో దక్షిణ భారతదేశంలో భాజపా బలం పెరుగుతుందని రవి విశ్వాసం వ్యక్తంచేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని