Pawan Kalyan: మాదకద్రవ్యాల హబ్‌గా ఏపీ: పవన్‌ కల్యాణ్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మాదకద్రవ్యాల హబ్‌గా మారిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. ఏపీలోని గంజాయి ప్రభావం దేశవ్యాప్తంగా పడుతోందన్నారు. 

Published : 27 Oct 2021 10:59 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మాదకద్రవ్యాల హబ్‌గా మారిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. ఏపీలోని గంజాయి ప్రభావం దేశవ్యాప్తంగా పడుతోందన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్లు చేశారు. ‘‘గంజాయి నివారణకు నేతలు చర్యలు తీసుకోవట్లేదు. ఆంధ్రా- ఒడిశా సరిహద్దు(ఏవోబీ) ప్రాంతంలో 2018లో నా పోరాటయాత్రలో గంజాయిపై చాలా ఫిర్యాదులు వచ్చాయి. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఆ సమయంలో పోరాటయాత్ర చేశాను. ఏవోబీలో గంజాయి మాఫియాపై.. నిరుద్యోగం, అక్రమ మైనింగ్‌కు సంబంధించి ఫిర్యాదులొచ్చాయి’’ అని పవన్‌ అన్నారు. ఏపీలో గంజాయి మూలాలున్నాయంటూ హైదరాబాద్‌ సీపీ, నల్గొండ ఎస్పీలు చేసిన వ్యాఖ్యల వీడియోలను పవన్‌ ట్వీట్లకు జత చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని