TIDCO Houses: మేం ఇళ్లు కట్టిస్తే.. వైకాపా రంగులు వేసుకుంది: యనమల రామకృష్ణుడు

వైకాపా ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లలో పేదలకు ఎన్ని ఇళ్లు కట్టించిందో శ్వేతపత్రం విడుదల చేయాలని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు డిమాండ్‌ చేశారు.

Updated : 12 Oct 2023 11:51 IST

రాజమహేంద్రవరం: వైకాపా ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లలో పేదలకు ఎన్ని ఇళ్లు కట్టించిందో శ్వేతపత్రం విడుదల చేయాలని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు డిమాండ్‌ చేశారు. రాజమహేంద్రవరంలో ఆయన మాట్లాడారు. తమ పాలనలో టిడ్కో ఇళ్లు పూర్తి చేస్తే.. వైకాపా ప్రభుత్వం రంగులు మాత్రమే వేసుకొని గొప్పలు చెబుతోందని దుయ్యబట్టారు. ఇలా మోసం చేసిన సీఎం జగన్‌ను గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. 

‘‘ఎస్సీ, బీసీలకు సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారు. ఒకవైపు పథకాలన్నీ రద్దు చేసి.. మరోవైపు ఖజానా ఖాళీ చేశారు. ఈ నిధులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్లాయో లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పులు ఏ రాష్ట్రమైనా చేస్తుంది.. కానీ అక్కడ అభివృద్ధి కనిపించాలి. ఇళ్ల పట్టాల పేరుతో పేదల పేరు చెప్పి వైకాపా ప్రభుత్వం భూములు దోచుకుంటోంది’’ అని యనమల ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని