పొలంలో బయటపడ్డ రద్దైన నోట్ల కట్టలు

రోడ్డు మీద కరెన్సీ నోటు కనిపిస్తే చాలా మంది వెంటనే జేబులో వేసుకుంటూ ఉంటారు. ఒకవేళ అది రద్దైన పాత నోటు అయితే? ఎవరూ దాని జోలికి కూడా వెళ్లరు. బిహార్‌లో మాత్రం పోటీపడి మరీ ప్రజలు పాత నోట్లను ఎత్తుకుపోయారు. పట్నా జిల్లా పసౌడా గ్రామంలో

Published : 29 Jun 2022 05:59 IST

రోడ్డు మీద కరెన్సీ నోటు కనిపిస్తే చాలా మంది వెంటనే జేబులో వేసుకుంటూ ఉంటారు. ఒకవేళ అది రద్దైన పాత నోటు అయితే? ఎవరూ దాని జోలికి కూడా వెళ్లరు. బిహార్‌లో మాత్రం పోటీపడి మరీ ప్రజలు పాత నోట్లను ఎత్తుకుపోయారు. పట్నా జిల్లా పసౌడా గ్రామంలో అజయ్‌ సింగ్‌ తన పొలాన్ని దున్నిస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌కు రద్దైన నగదు నోట్లు ఉన్న ఓ మూట పొలంలో దొరికింది. అజయ్‌ సింగ్‌ ఈ విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. అయితే అప్పటికే చుట్టపక్కల వారికి ఈ విషయం తెలిసిపోయింది. దీంతో వారు అవి పాతనోట్లు అని లెక్కచేయకుండా ఎగబడ్డారు. వీలైనన్ని నోట్లు తీసుకుని పరారయ్యారు. పోలీసులు వచ్చేసరికి చాలా నోట్లు మాయమయ్యాయి. పొలం వద్ద మిగిలిన కొన్ని నోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. రూ.500, రూ.1000 నోట్ల కట్టలతో ఉన్న మూటను పొలంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌ గుర్తించాడని.. ఈ డబ్బు ఎవరిది? పొలంలో ఎందుకు దాచారు? అన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. నోట్లు ఎత్తుకెళ్లిన వారిని గుర్తించి..  వాటిని స్వాధీనం చేసుకుంటామని స్పష్టంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని