Uddhav Thackeray: ప్రయోజనాలన్నీ పొంది మోసం చేశారు: ఉద్ధవ్‌

పార్టీ నుంచి ప్రయోజనాలన్నీ పొందిన వ్యక్తులు మోసం చేయడం తీవ్ర మనస్తాపం కలిగించిందని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి కేంద్రీకరిస్తానని తెలిపారు. అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్న కలమ్నూరి ఎమ్మెల్యే సంతోష్‌ బంగర్‌

Updated : 06 Jul 2022 11:23 IST

ఔరంగాబాద్‌: పార్టీ నుంచి ప్రయోజనాలన్నీ పొందిన వ్యక్తులు మోసం చేయడం తీవ్ర మనస్తాపం కలిగించిందని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి కేంద్రీకరిస్తానని తెలిపారు. అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్న కలమ్నూరి ఎమ్మెల్యే సంతోష్‌ బంగర్‌ కూడా చివరి నిమిషంలో రెబెల్‌ వర్గంతో చేతులు కలిపి సీఎం ఏక్‌నాథ్‌ శిందేకు మద్దతివ్వడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. అసమ్మతిదారుల శిబిరంలో ఉన్న వారందరూ తిరిగి వచ్చేయాలని విలపిస్తూ వీడియో సందేశాలు పంపిన సంతోష్‌ ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఠాక్రే వర్గాన్ని వీడడం ఆశ్చర్యపరిచింది.

ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి హింగోలి జిల్లా నాయకులు, కార్యకర్తలతో ఫోన్‌ ద్వారా ఉద్ధవ్‌ ఠాక్రే మాట్లాడారు. ఐక్యంగా ఉండాలని వారందరికీ ధైర్యం చెప్పారు. త్వరలోనే హింగోలి జిల్లాలో పర్యటిస్తానని తెలిపారు. ‘పార్టీ నుంచి ఎలాంటి ప్రయోజనాలు పొందని వారు ఇప్పుడు నాతో ఉన్నారు. పదవులు, ఆర్థిక ప్రయోజనాలు పొందిన వ్యక్తులు మోసం చేశారు’ అని ఠాక్రే ఆవేదన వ్యక్తం చేశారు.

మధ్యంతర ఎన్నికలు వస్తే 100 స్థానాల్లో గెలుస్తాం: సంజయ్‌ రౌత్‌

ముంబయి: ఇప్పటికిప్పుడు మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తే ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన 100 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్‌ రౌత్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని