Auto Driver: ఆటోడ్రైవర్‌ సూపర్‌ ఇంగ్లిష్‌..

బెంగళూరుకు చెందిన 74 ఏళ్ల  ఆటోడ్రైవర్‌ ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడుతున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని నికితా అయ్యర్‌ పోస్ట్‌ ద్వారా ఆటో డ్రైవర్‌ పట్టాభి రామన్‌ ప్రతిభ వెలుగులోకి వచ్చింది.

Updated : 30 Mar 2022 11:33 IST

బెంగళూరుకు చెందిన 74 ఏళ్ల  ఆటోడ్రైవర్‌ ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడుతున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని నికితా అయ్యర్‌ పోస్ట్‌ ద్వారా ఆటో డ్రైవర్‌ పట్టాభి రామన్‌ ప్రతిభ వెలుగులోకి వచ్చింది. పట్టాభి ఆటోలో 45 నిమిషాల పాటు ప్రయాణించిన నికిత.. ఆయన ఇంగ్లిష్‌ నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తర్వాత ఈ వివరాలను లింక్డ్‌ ఇన్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. కార్యాలయానికి వెళ్లేందుకు నికితా అయ్యర్‌ ఆటో కోసం ఎదురుచూస్తుండగా.. పట్టాభి రామన్‌ వచ్చి ఆంగ్లంలో మాట్లాడారు. ఆటో ప్రయాణంలో ఇద్దరూ ఇంగ్లిషులోనే మాట్లాడుకున్నారు. మీరు ఇంత స్పష్టంగా ఇంగ్లిష్‌ ఎలా మాట్లాడుతున్నారు? అని నికిత అడగ్గా.. పూర్వం తాను ఆంగ్లం ఉపాధ్యాయుడిగా పని చేశానని పట్టాభి తెలిపారు. ఆ తర్వాత ఇరువురి మధ్య జరిగిన సంభాషణను నికిత లింక్డ్‌ ఇన్‌లో పోస్ట్‌ చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని