టీ20 ప్రపంచకప్‌కు కివీస్‌ జట్టిదే

కేన్‌ విలియమ్సన్‌ నాలుగోసారి టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్‌ డెవోన్‌ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది.

Published : 30 Apr 2024 03:52 IST

ఆక్లాండ్‌: కేన్‌ విలియమ్సన్‌ నాలుగోసారి టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్‌ డెవోన్‌ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. విలియమ్సన్‌ నేతృత్వంలోని ప్రపంచకప్‌ జట్టును సోమవారం ప్రకటించారు. గాయం వల్ల కాన్వే ఐపీఎల్‌కు దూరమైన సంగతి తెలిసిందే. జట్టులో చోటు లభించిన వారిలో రచిన్‌ రవీంద్ర, మ్యాట్‌ హెన్రీలకు మాత్రమే టీ20 ప్రపంచకప్‌లో ఆడిన అనుభవం లేదు. విలియమ్సన్‌కు ఇదే ఆరో టీ20 ప్రపంచకప్‌. న్యూజిలాండ్‌ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి తప్పుకున్న ట్రెంట్‌ బౌల్ట్‌ కూడా ప్రపంచకప్‌ జట్టుకు ఎంపికయ్యాడు. న్యూజిలాండ్‌ ప్రపంచకప్‌ జట్టు: విలియమ్సన్‌, ఫిన్‌ అలెన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, బ్రాస్‌వెల్‌, చాప్‌మన్‌, కాన్వే, ఫెర్గూసన్‌, మ్యాట్‌ హెన్రీ, డరిల్‌ మిచెల్‌, నీషమ్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, రచిన్‌ రవీంద్ర, శాంట్నర్‌, ఇష్‌ సోధి, టిమ్‌ సౌథీ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని