FIFA World Cup 2022: నోరు మూసుకుని ఫొటో

జపాన్‌తో మ్యాచ్‌కు ముందు టీమ్‌ ఫొటో కోసం జర్మనీ ఆటగాళ్లు సిద్ధమయ్యారు. ఫొటో తీసే ముందు ఒక్కసారిగా తమ కుడి చేతులతో నోళ్లను మూసుకున్నారు.

Updated : 24 Nov 2022 06:59 IST

దోహా: జపాన్‌తో మ్యాచ్‌కు ముందు టీమ్‌ ఫొటో కోసం జర్మనీ ఆటగాళ్లు సిద్ధమయ్యారు. ఫొటో తీసే ముందు ఒక్కసారిగా తమ కుడి చేతులతో నోళ్లను మూసుకున్నారు. హరివిల్లు రంగులతో కూడిన ఆర్మ్‌ బ్యాండ్లను ఆటగాళ్లు ధరించకుండా ఫిఫా నిషేధించడానికి నిరసనగా వీళ్లు ఇలా చేశారు. జర్మనీతో సహా ఐరోపాలోని ఏడు ఫుట్‌బాల్‌ దేశాల జట్ల కెప్టెన్లు ఖతార్‌లో ప్రపంచకప్‌ సందర్భంగా వివక్షకు వ్యతిరేకంగా ‘‘వన్‌ లవ్‌’’తో కూడిన ఆర్మ్‌ బ్యాండ్లు ధరించాలనుకున్నారు. కానీ ఫిఫా అందుకు ఒప్పుకోలేదు. అలా ఎవరైనా ఆర్మ్‌ బ్యాండ్‌ ధరిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు మైదానంలో వెంటనే ఎల్లో కార్డు చూపిస్తామని హెచ్చరించింది. దీంతో ఆ జట్లు వెనక్కితగ్గాయి. ఖతార్‌లో స్వలింగ సంపర్కాన్ని నేరంగా చూడడంతో పాటు అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలకు ఈ ఆర్మ్‌ బ్యాండ్లు సూచికగా ఉన్నాయి. ‘‘మానవ హక్కుల విషయంలో రాజీ ఉండకూడదు. ఇది రాజకీయ వేదిక కాదు. ఆర్మ్‌ బ్యాండ్లను నిషేధించడమంటే మాట్లాడే మా హక్కును కాలరాయడమే’’ అని జర్మనీ ఫుట్‌బాల్‌ సమాఖ్య  ట్వీట్‌ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని