వారి సరసన లబుషేన్‌

ఆసీస్‌ బ్యాటర్‌ లబుషేన్‌ అరుదైన క్లబ్‌లో చేరాడు. ఒకే మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ, సెంచరీ సాధించిన అతికొద్ది మంది సరసన చేరాడు.

Published : 04 Dec 2022 03:10 IST

ఆసీస్‌ బ్యాటర్‌ లబుషేన్‌ అరుదైన క్లబ్‌లో చేరాడు. ఒకే మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ, సెంచరీ సాధించిన అతికొద్ది మంది సరసన చేరాడు. ఈ ఘనత సాధించిన ఎనిమిదో క్రికెటర్‌ లబుషేన్‌. వాల్టర్స్‌ (ఆస్ట్రేలియా - 242, 103 వెస్టిండీస్‌పై 1969), గావస్కర్‌ (భారత్‌ - 124, 220, వెస్టిండీస్‌పై 1971), లారెన్స్‌ (వెస్టిండీస్‌ - 214, 100 నాటౌట్‌, న్యూజిలాండ్‌పై 1972), గ్రెగ్‌ చాపెల్‌ (ఆస్ట్రేలియా - 247 నాటౌట్‌, 133, న్యూజిలాండ్‌పై 1974), గూచ్‌ (ఇంగ్లాండ్‌ - 333, 123 భారత్‌పై 1990), లారా (వెస్టిండీస్‌ - 221, 130 శ్రీలంకపై 2001), సంగక్కర (శ్రీలంక - 319, 105 బంగ్లాదేశ్‌పై 2014) లబుషేన్‌ కన్నా ముందు ఈ ఘనత సాధించారు. వీరిలో గూచ్‌, సంగక్కర ట్రిపుల్‌ సెంచరీలు బాదారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని