World Cup 2023: వన్డే ప్రపంచకప్‌ అంపైర్లు వీరే.. భారత్‌ నుంచి ఒక్కరికే చోటు

భారత్‌ వేదికగా అక్టోబర్‌ 5 నుంచి వన్డే ప్రపంచకప్‌ (World Cup 2023) ప్రారంభంకానుంది. ఈ టోర్నీలో మ్యాచ్‌లకు అంపైర్లుగా, మ్యాచ్‌ రిఫరీలుగా వ్యవహరించే వారి జాబితాను ఐసీసీ (ICC) తాజాగా వెల్లడించింది.

Published : 08 Sep 2023 19:06 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌ వేదికగా అక్టోబర్‌ 5 నుంచి వన్డే ప్రపంచకప్‌ (World Cup 2023) ప్రారంభంకానుంది. సరిగ్గా నెల రోజుల సమయం కూడా లేకపోవడంతో మెగా టోర్నీ నిర్వహణకు నిర్వాహకులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా దేశాలు ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి. ఇదిలా ఉండగా.. ఈ టోర్నీలో మ్యాచ్‌లకు అంపైర్లుగా, మ్యాచ్‌ రిఫరీలుగా  వ్యవహరించే వారి జాబితాను ఐసీసీ (ICC) తాజాగా వెల్లడించింది. ఈ సారి 16 మంది అంపైర్లుగా, నలుగురు మ్యాచ్ రిఫరీలుగా వ్యవహరించనున్నారు.  ఐసీసీ అంపైర్స్‌ ఎమిరేట్స్ ఎలైట్ ప్యానెల్‌లోని మొత్తం 12 మందితోపాటు ఐసీసీ ఎమర్జింగ్ అంపైర్ ప్యానెల్‌లోని నలుగురు సభ్యులను (మొత్తం 16 మంది) ప్రపంచకప్‌లో అంపైర్లుగా తీసుకుంది. ఈ 16 మందిలో భారత్‌ నుంచి నితిన్‌ మేనన్ (Nitin Menon) ఒక్కరే చోటు దక్కించుకున్నారు.  

క్రికెట్ అభిమానులకు తీపికబురు.. భారత్‌, పాక్‌ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే

భారత మాజీ క్రికెటర్ జవగళ్ శ్రీనాథ్‌తో జెఫ్ క్రోవ్, ఆండీ పైక్రాఫ్ట్, రిచీ రిచర్డ్‌సన్, మ్యాచ్‌ రిఫరీలుగా వ్యవహరించనున్నారు. ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే ప్రపంచకప్‌ ఆరంభపోరులో నితిన్ మేనన్, కుమార్‌ ధర్మసేన ఆన్‌ఫీల్డ్ అంపైర్లుగా, పాల్ విల్సన్ థర్డ్ అంపైర్‌గా, నాలుగో అంపైర్‌గా సైకత్, జవగళ్ శ్రీనాథ్‌ మ్యాచ్‌ రిఫరీగా ఉండనున్నారు. 

వన్డే ప్రపంచకప్ అంపైర్లు: 

క్రిస్ బ్రౌన్, కుమార్ ధర్మసేన, మరైస్ ఎరాస్మస్, క్రిస్ గఫానీ, మైఖేల్ గోఫ్, అడ్రియన్ హోల్డ్‌స్టాక్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిచర్డ్ కెటిల్‌బరో, నితిన్ మేనన్, అహ్సన్ రజా, పాల్ రీఫిల్, షర్ఫుదౌలా ఇబ్నే షైద్, రాడ్ టకర్, పాల్ అలెక్స్ వాల్సన్, జోయెల్ విల్సన్, పాల్ విల్సన్.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని