India vs Pakistan: క్రికెట్ అభిమానులకు తీపికబురు.. భారత్‌, పాక్‌ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే

ఆసియా కప్‌లో భాగంగా సెప్టెంబరు 10న కొలంబో వేదికగా భారత్‌, పాక్‌ (India vs Pakistan) మధ్య జరిగే సూపర్‌-4 మ్యాచ్‌కు రిజర్వ్‌ డే ఉన్నట్లు ఆసియా క్రికెట్‌ కౌన్సిల్ (ACC)  వెల్లడించింది. 

Updated : 08 Sep 2023 15:29 IST

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్‌ అభిమానులకు ఆసియా క్రికెట్‌ కౌన్సిల్ (ACC) తీపి కబురు అందించింది. ఆసియా కప్‌లో భాగంగా సెప్టెంబరు 10న కొలంబో వేదికగా భారత్‌, పాక్‌ (India vs Pakistan) మధ్య జరిగే సూపర్‌-4 మ్యాచ్‌కు రిజర్వ్‌ డే ఉన్నట్లు వెల్లడించింది. సెప్టెంబరు 11ను రిజర్వ్‌ డేగా ప్రకటించింది. ఒకవేళ 10న మ్యాచ్‌ మొదలైన తర్వాత వర్షం అంతరాయం కలిగించి ఆటను నిలిపివేస్తే.. ఎన్ని ఓవర్ల వద్ద మ్యాచ్‌ ఆగిపోయిందో మరుసటి రోజు అక్కడి నుంచే మ్యాచ్‌ తిరిగి ప్రారంభమవుందని ఏసీసీ స్పష్టం చేసింది. మ్యాచ్‌ టికెట్లు రిజర్వ్‌ డే రోజున కూడా చెల్లుబాటు అవుతాయని తెలిపింది. 

Asia Cup 2023 - BCCI: ఏదో అనుకుంటే..

సూపర్‌-4లో భారత్, పాక్ మ్యాచ్‌ మినహా మిగతా మ్యాచ్‌లకు రిజర్వ్ డే లేదు. గ్రూప్‌ దశలో దాయాదుల మధ్య జరిగిన మ్యాచ్‌ వర్షార్పణం అయిన సంగతి తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 266 పరుగులకు ఆలౌట్‌ కాగా.. పాకిస్థాన్‌ లక్ష్యఛేదనకు దిగకముందే వరుణుడు అడ్డుపడ్డాడు. దీంతో మ్యాచ్‌ రద్దు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు