ICC Rankings: ఐసీసీ ర్యాంకులు.. నాలుగో స్థానంలోకి శుభ్‌మన్‌ గిల్

విండీస్‌తో వన్డే సిరీస్‌, ఐర్లాండ్‌తో టీ20 సిరీసుల్లో రాణించడంతో భారత ఆటగాళ్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో (Team India) తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు.

Published : 23 Aug 2023 17:25 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా (Team India) యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌కు ఆసియా కప్‌ (Asia Cup 2023) ముందు ఉత్సాహాన్ని నింపే కబురును ఐసీసీ అందించింది. వన్డే ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. తాజాగా విడుదల చేసిన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగుపర్చుకుని శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) 743 పాయింట్లతో నాలుగో ర్యాంక్‌ సాధించాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో పాకిస్థాన్‌ కెప్టెన్ బాబర్ అజామ్ (880) ఉన్నారు. అదే విధంగా టీ20 ర్యాంకింగ్స్‌లో బుమ్రా ఏడు స్థానాలను మెరుగుపర్చుకుని 84వ ర్యాంకులోకి.. రవి బిష్ణోయ్ 17 స్థానాలు ఎగబాకి 65వ స్థానానికి చేరాడు. ఐర్లాండ్‌తో రెండో టీ20 మ్యాచ్‌లో అర్ధశతకం సాధించిన రుతురాజ్‌ గైక్వాడ్‌ ఏకంగా 143 స్థానాలు దూసుకొచ్చి 87వ ర్యాంక్‌ను అందుకోవడం గమనార్హం. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ ఆడకపోయినా.. టీ20 ర్యాంకింగ్స్‌లో మాత్రం సూర్యకుమార్‌ (889 పాయింట్లు) అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. 

మా ఆందోళనంతా పాండ్య ఫామ్‌పైనే.. కేఎల్ కోసం వెంకటేశ్‌ ప్రసాద్ ప్రత్యేక ప్రార్థనలు!

బౌలింగ్‌ జాబితా ప్రకారం.. టెస్టుల్లో టీమ్‌ఇండియా సీనియర్‌ బౌలర్‌ రవిచంద్రన్ అశ్విన్‌ (879 పాయింట్లు) అగ్రస్థానంలో ఉన్నాడు. టాప్‌ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (782 పాయింట్లు) రెండు స్థానాలను మెరుగుపర్చుకుని మూడో ర్యాంక్‌కు చేరాడు. దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ (825) రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. వన్డేల్లో భారత్‌ తరఫున మహమ్మద్ సిరాజ్ (670) ఐదో ర్యాంక్‌, కుల్‌దీప్‌ యాదవ్ (622) పదో స్థానంలో ఉన్నారు. టీ20 బౌలింగ్‌ జాబితాలో మాత్రం ఒక్క టీమ్ఇండియా బౌలర్‌ కూడా టాప్‌-10లో స్థానం సంపాదించలేకపోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని