Hardik Pandya: 5 ట్రోఫీలు.. నా అదృష్టం: హార్దిక్‌ పాండ్య

ఎల్లప్పుడూ బాధ్యతను ఆస్వాదిస్తానని.. జట్టును ముందుండి నడిపిస్తానని గుజరాత్‌ సారథి హార్దిక్‌ పాండ్య అన్నాడు. జట్టుకు దారి చూపించే పతాకధారిగా ఉండటం తనకిష్టమని తెలిపాడు. ‘‘నేను ప్రేమతో జీవిస్తున్నా. అది నా కుటుంబం నుంచి పొందుతూనే ఉంటా. నేను ఎల్లప్పుడూ బాధ్యతను ఆస్వాదించా.

Updated : 31 May 2022 06:47 IST

అహ్మదాబాద్‌

ల్లప్పుడూ బాధ్యతను ఆస్వాదిస్తానని.. జట్టును ముందుండి నడిపిస్తానని గుజరాత్‌ సారథి హార్దిక్‌ పాండ్య అన్నాడు. జట్టుకు దారి చూపించే పతాకధారిగా ఉండటం తనకిష్టమని తెలిపాడు. ‘‘నేను ప్రేమతో జీవిస్తున్నా. అది నా కుటుంబం నుంచి పొందుతూనే ఉంటా. నేను ఎల్లప్పుడూ బాధ్యతను ఆస్వాదించా. జట్టును ముందుండి నడిపించాలనుకునే వ్యక్తి. అప్పుడే ఉదాహరణగా నిలువొచ్చు. ఒక నిర్దిష్ట మార్గంలో జట్టు పనిచేయాలని కోరుకున్నప్పుడు.. దారి చూపించే పతాక ధారిని నేనే కావాలి. ఆ పనిని మొదట నేనే చేస్తే మరింత అర్థవంతంగా ఉంటుంది. కెప్టెన్‌గా ట్రోఫీ అందుకున్నా కాబట్టి ఈ టీ20 లీగ్‌ నాకు మరింత ప్రత్యేకం. గతంలో 4 సార్లు ముంబయి తరఫున (2015, 17, 19, 20) ట్రోఫీలు నెగ్గడం కూడా అంతే ప్రత్యేకం. 5 టీ20 లీగ్‌ ట్రోఫీలు గెలవడం నా అదృష్టం. కానీ ఈ టీ20 లీగ్‌ ట్రోఫీ కొత్త సంప్రదాయాన్ని సృష్టిస్తుంది. ఇక ఏదేమైనా టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ గెలవాలి. నాలాంటి వాడికి జట్టే ప్రధానం. జట్టు ప్రపంచకప్‌ అందుకోవడమే నా లక్ష్యం. ఎప్పుడైనా టీమ్‌ఇండియాకు ఆడటం కల సాకారమైనట్లుగా ఉంటుంది. నేను ఎన్ని మ్యాచ్‌లు ఆడినా.. నాకెప్పుడూ ప్రేమ, మద్దతు లభించాయి. స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యం ఒకటే ఉంది. టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ గెలవాలని కోరుకుంటున్నా’’ అని హార్దిక్‌ వివరించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని