
Trojan Malware: ఆండ్రాయిడ్ యూజర్స్.. ఈ యాప్స్‌తో జాగ్రత్త!
ఇంటర్నెట్‌డెస్క్: ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్స్ ప్లేస్టోర్ నుంచి యాప్‌లు డౌన్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూజర్స్ బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరిస్తున్న యాప్‌లను సుమారు 3 లక్షల మందికి పైగా డౌన్లోడ్ చేసినట్లు తెలిపారు. హ్యాకర్స్ గూగుల్ ప్లేస్టోర్ సెక్యూరిటీని అతిక్రమించి ట్రోజన్ మాల్వేర్ను యాప్‌లలోకి ప్రవేశపెట్టినట్లు థ్రెట్‌ఫ్యాబ్రిక్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. ఈ యాప్స్‌లో ఎక్కువగా క్యూఆర్ కోడ్ రీడర్స్, డాక్యుమెంట్ స్కానర్స్, ఫిట్నెస్ మానిటర్స్, క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, టూ ఫ్యాక్టర్ అథెంటికేటర్ వంటివి ఉన్నట్లు గుర్తించింది. అలానే ఈ కేటగిరీ యాప్‌లను డౌన్లోడ్ చేసేటప్పుడు యూజర్స్ రివ్యూలను జాగ్రత్తగా చదవాలని సూచించింది. ఈ యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకునేందుకు ఆకర్షణీమయైన ప్రకటనలతో యూజర్స్‌ను ఆకట్టుకుంటున్నట్లు తెలిపింది. దీంతో ప్రకటనల వెనుక మోసం గురించి తెలియని యూజర్స్ సదరు యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకుంటున్నారని థ్రెట్‌ఫ్యాబ్రిక్ వెల్లడించింది.
యాజర్స్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోనంతవరకే మాల్వేర్ ఇన్-యాక్టివ్‌గా ఉంటుందని.. ఒకసారి ఇన్స్టాల్ చేసిన వెంటనే మాల్వేర్ యాక్టివ్ అవుతోందని థ్రెట్‌ఫ్యాబ్రిక్ సైబర్ నిపుణులు పేర్కొన్నారు. తర్వాత గూగుల్ ప్లేస్టోర్‌లోని సెక్యూరిటీ పరిధులను అతిక్రమించి ఈ యాప్స్ హ్యాకర్స్‌కు యూజర్స్ సమాచారం చేరవేస్తున్నాయని తెలిపారు. ట్రోజన్తో పాటు అనాస్టా అనే మరో మాల్వేర్ కూడా యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తోపాటు టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ సమాచారాన్ని సేకరిస్తున్నాయని వెల్లడించారు. అంతేకాకుండా యూజర్స్ ఫోన్లలో బ్యాకింగ్ వివరాలు టైప్ చేసేప్పుడు స్క్రీన్ రికార్డ్ చేస్తోందని తెలిపారు. అయితే ఇప్పటికే ఈ మాల్వేర్ గురించి గూగుల్‌ను అప్రమత్తం చేసినట్లు థ్రెట్‌ఫ్యాబ్రిక్ వెల్లడించింది. దీంతో గూగుల్ వీటిలో చాలా వరకు యాప్స్‌ను ప్లేస్టోర్ నుంచి తొలగించిందని తెలిపింది. భారత్‌లో ప్రముఖ్య బ్యాంక్‌ల యాప్‌లను కూడా హ్యాకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు గుర్తించామని థ్రెట్‌ఫ్యాబ్రిక్ తన నివేదికలో పేర్కొంది. అలానే పైన పేర్కొన్న కేటగిరీలకు సంబంధించిన థర్డ్‌పార్టీ యాప్‌లను యూజర్స్ ఉపయోగిస్తుంటే వెంటనే వాటిని డిలీట్ చేయమని సూచించింది.
► Read latest Gadgets & Technology News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.