గూగుల్‌ హోం ఉనికినీ గుర్తిస్తుంది!

ఇప్పుడిక గూగుల్‌ హోం యాప్‌ మన ఉనికినీ గుర్తిస్తుంది. నెస్ట్‌ స్పీకర్ల ద్వారా వినియోగదారుల ఉనికిని గుర్తించేలా ప్రజెన్స్‌ సెన్సింగ్‌ ఫీచర్‌ను తీర్చిదిద్దారు మరి. ఇది ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ పరికరాలు రెండింటిలోనూ పనిచేస్తుంది.

Updated : 28 Sep 2022 10:56 IST

ఇప్పుడిక గూగుల్‌ హోం యాప్‌ మన ఉనికినీ గుర్తిస్తుంది. నెస్ట్‌ స్పీకర్ల ద్వారా వినియోగదారుల ఉనికిని గుర్తించేలా ప్రజెన్స్‌ సెన్సింగ్‌ ఫీచర్‌ను తీర్చిదిద్దారు మరి. ఇది ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ పరికరాలు రెండింటిలోనూ పనిచేస్తుంది. సెటింగ్స్‌లోని ఫీచర్స్‌ విభాగం ద్వారా దీన్ని ఎనేబుల్‌ చేసుకోవచ్చు. దీంతో నెస్ట్‌ స్పీకర్లు, డిస్‌ప్లేలు మన ఉనికిని మరింత బాగా గుర్తిస్తాయి. ఇంట్లో ఉన్నారో లేదో గుర్తించి ఆటోమేటెడ్‌ పనులు నిర్వహిస్తాయి. నెస్ట్‌ ఆడియోతో మాట్లాడినా, నెస్ట్‌ హబ్‌ మీద తాకినా ఉనికిని పసిగడతాయి. లైట్లు ఆన్‌ లేదా ఆఫ్‌ చేయటం వంటి పనులు చేసి పెడతాయి. రెండో తరం నెస్ట్‌ హబ్‌లైతే సోలి అనే రాడార్‌ చిప్‌ సాయంతో ఎంత సమీపంలో ఉన్నామో కూడా గ్రహిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని