బుడగల పొర పుట్టిందిలా..

సున్నితమైన వస్తువులను బుడగలతో కూడిన ప్లాస్టిక్‌ పొరలో చుట్టి ప్యాక్‌ చేసి, రవాణా చేయటం చూస్తూనే ఉంటాం.

Updated : 09 Nov 2022 09:33 IST

సున్నితమైన వస్తువులను బుడగలతో కూడిన ప్లాస్టిక్‌ పొరలో చుట్టి ప్యాక్‌ చేసి, రవాణా చేయటం చూస్తూనే ఉంటాం. నిజానికిది వాల్‌పేపర్‌ను సృష్టించే క్రమంలో పుట్టుకొచ్చింది. ఆల్‌ఫ్రెడ్‌ ఫీల్డింగ్‌, మార్క్‌ చవనెస్‌ అనే ఇంజినీర్లు 1957లో దీన్ని సృష్టించారు. రెండు ప్లాస్టిక్‌ షవర్‌ కర్టెన్లను ఒక దానిపై మరోటి పెట్టి, వేడి పరికరంతో సీల్‌ చేశారు. కానీ అవి సరిగా  అతుక్కోలేదు. మధ్య మధ్యలో గాలి బుడగలు ఏర్పడ్డాయి. దీంతో నిరాశ చెందారు. కానీ తమ ఆవిష్కరణ పూర్తిగా విఫలమైపోయిందని మాత్రం అనుకోలేదు. ఈ పక్రియ కోసం పలు పేటెంట్లు తీసుకున్నారు. తర్వాత దీన్ని ఎలా వాడుకోవాలనే దానిపై దీర్ఘంగా ఆలోచించారు. ఫీల్డింగ్‌, చవనెస్‌ 1960లో సీల్డ్‌ ఎయిర్‌ అనే కంపెనీని స్థాపించారు. అప్పుడే వారికి బబుల్‌ పొరను ప్యాకేజీ కోసం వాడాలనే ఆలోచన వచ్చింది. ఆ సమయంలోనే ఐబీఎం కొత్త కంప్యూటర్‌ తయారీ యూనిట్‌ను ప్రారంభించింది. సున్నితమైన కంప్యూటర్ల ప్యాకేజీకిది అనువుగా ఉండటం బాగా ఆకర్షించింది. అలా మొదలైన దీని ప్యాకేజీ ప్రస్థానం విశేష ఆదరణ పొందింది. కొందరు దీని బుడగలను నొక్కి, పగలగొడుతూ ఒత్తిడినీ తగ్గించుకుంటుంటారు కూడా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని