ఐమెసేజెస్‌తో అదృశ్య సందేశాలు

ఐఫోన్‌ అంటేనే వినూత్న ఫీచర్ల పుట్ట. ఐఓఎస్‌ 16 అప్‌డేట్‌ ఇవి మరింత విస్తృతమయ్యాయి. ఇది బోలెడన్ని ఆశ్చర్యకర ఫీచర్లను పరిచయం చేసింది.

Published : 11 Jan 2023 00:54 IST

ఐఫోన్‌ అంటేనే వినూత్న ఫీచర్ల పుట్ట. ఐఓఎస్‌ 16 అప్‌డేట్‌ ఇవి మరింత విస్తృతమయ్యాయి. ఇది బోలెడన్ని ఆశ్చర్యకర ఫీచర్లను పరిచయం చేసింది. వీటిల్లో తెలుసుకోవాల్సినవి ఇంకా చాలానే ఉన్నాయి. వీటిల్లో ఒకటి ఐమెసేజెస్‌ యాప్‌ ద్వారా ‘ఇన్‌విజిబుల్‌ మెసేజెస్‌’ పంపటం. దీంతో అవతలివారిని ఆశ్చర్యంలో ముంచెత్తొచ్చు. ఎందుకంటే మనం పంపించిన మెసేజ్‌ మసక మసకగా కనిపిస్తుంది. దాని మీద వేలితో రుద్దితే గానీ స్పష్టంగా కనిపించదు. ఐఓఎస్‌ 16 అప్‌డేట్‌ను సపోర్టు చేసే ఐఫోన్లలోనే ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంటుంది. మరి ఇంతటి ఆశ్చర్యకరమైన సదుపాయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసా?
* ఐఫోన్‌లో ఐమెసేజెస్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి.
* అదృశ్య మెసేజ్‌ను పంపించాలని అనుకుంటున్న ఛాట్‌లోకి వెళ్లాలి. మెసేజ్‌ను టైప్‌ చేసి, మెమోజీ లేదా ఫొటో జత చేయాలి.
* సెండ్‌ బటన్‌ను తాకి, కాసేపు అలాగే అదిమి ఉంచాలి.
* బూడిద రంగు చుక్కల మీద క్లిక్‌ చేస్తే సెండ్‌ విత్‌ ఇన్‌విజిబుల్‌ ఆప్షన్‌.. అక్కడ మెసేజ్‌ ప్రివ్యూ కనిపిస్తాయి.
* మెసేజ్‌ మరింత ఆశ్చర్యం కలిగించేలా స్లామ్‌, లౌడ్‌, జెంటిల్‌ ఆప్షన్లనూ ఎంచుకోవచ్చు.  
* ఇష్టమైన ఎఫెక్ట్‌ను ఎంచుకున్నాక మెసేజ్‌ను సెండ్‌ చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని