3.3 కోట్ల ఏళ్ల పువ్వు!

అదొక పువ్వు. ఎప్పటిదో తెలుసా? 3.3 కోట్ల ఏళ్ల క్రితం నాటిది. శిలాజంగా మారిన జిగురులో చెక్కు చెదరకుండా ఇంకా భద్రంగా ఉంది. అందుకే దీన్ని అతిపెద్ద శిలాజ పువ్వుగా భావిస్తున్నారు.

Updated : 22 Mar 2023 03:18 IST

దొక పువ్వు. ఎప్పటిదో తెలుసా? 3.3 కోట్ల ఏళ్ల క్రితం నాటిది. శిలాజంగా మారిన జిగురులో చెక్కు చెదరకుండా ఇంకా భద్రంగా ఉంది. అందుకే దీన్ని అతిపెద్ద శిలాజ పువ్వుగా భావిస్తున్నారు. ఇది అడ్డంగా 28 మి.మీ. ఉంటుంది. ఉత్తర యూరప్‌లోని బాల్టిక్‌ అడవుల్లో బయటపడ్డ ఇది స్టీవార్టియా కోవాలీవ్‌స్కీ అనే పురాతన సతత హరిత మొక్కకు చెందిందని భావిస్తున్నారు. నిజానికి దీని గురించి 1872లోనే ప్రస్తావించారు. అయితే ఇటీవలే ఈ పువ్వు పుప్పొడిని శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఆసియాలో కనిపించే సింప్లోకాస్‌ జాతులకు సంబంధించినదని ఇందులో తేలింది. అందుకే దీనికి సింప్లోకాస్‌ కోవాలీవ్‌స్కీ అని పేరు పెట్టారు. జిగురులో చిక్కుకొని పోవటం వల్ల దీని మీద పురుగులు పెరగకపోయి ఉండొచ్చని, అందుకే దెబ్బతినకుండా ఉండి ఉంటుందని అనుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని