గూగుల్‌ సెర్చ్‌ తెలివిగా..

స్మార్ట్‌ఫోన్లలో గూగుల్‌ సెర్చ్‌ను వాడనివారుండరంటే అతిశయోక్తి కాదు. కానీ తేలికగా, త్వరగా ఆయా అంశాలను శోధించటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయనే సంగతి తెలుసా? అలాంటి కొన్ని ఉపాయాల గురించి తెలుసుకుందాం.

Published : 20 Mar 2024 00:33 IST

స్మార్ట్‌ఫోన్లలో గూగుల్‌ సెర్చ్‌ను వాడనివారుండరంటే అతిశయోక్తి కాదు. కానీ తేలికగా, త్వరగా ఆయా అంశాలను శోధించటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయనే సంగతి తెలుసా? అలాంటి కొన్ని ఉపాయాల గురించి తెలుసుకుందాం.

మాటలతో: కొన్నిసార్లు టైప్‌ చేయటం కుదరకపోవచ్చు. లేదూ టైప్‌ చేయటానికి ఎక్కువ సమయం పడుతుందని అనుకోవచ్చు. ఇలాంటప్పుడు మాటలతోనే సెర్చ్‌ చేయొచ్చు. గూగుల్‌ అసిస్టెంట్‌ను ఎనేబుల్‌ చేసుకొని.. హే గూగుల్‌ అని పిలిచి అవసరమైన వాటిని సెర్చ్‌ చేయమని ఆదేశించొచ్చు. సమంజసమైన ఫలితాలను శోధించి చూపుతుంది. ఇలా స్క్రీన్‌ను తాకకుండానే సెర్చ్‌ చేసేయొచ్చు.

 చేతిరాతతో: గూగుల్‌లో హ్యాండ్‌రైట్‌ అనే ఫీచర్‌ కూడా ఉంది. దీని ద్వారా తెర మీద వేలితో అవసరమైన అంశాన్ని రాసి సెర్చ్‌ చేసుకోవచ్చు.

 వృత్తం గీసి: సామ్‌సంగ్‌, గూగుల్‌ పిక్సెల్‌ వంటి కొన్ని ఫోన్లలో తెర మీద కనిపించే టెక్స్ట్‌, ఇమేజెస్‌, వీడియోల మీద వృత్తాన్ని గీసి సెర్చ్‌ చేయొచ్చు కూడా. వృత్తంలోని అంశాలను గూగుల్‌ గుర్తించి శోధిస్తుంది.
లెన్స్‌ సాయంతో: లెన్స్‌ అనేది ఇమేజ్‌లను గుర్తించే టెక్నాలజీతో పనిచేస్తుంది. ఫోన్‌ కెమెరాతో తీసిన ఫొటోలు లేదా ఫోన్‌లో ఉన్న ఫొటోలైనా దీనికి వాడుకోవచ్చు. ఫొటోలోని అంశాలను చిటికెలో వెతికి పెడుతుంది.
అడ్వాన్స్డ్‌ టూల్‌తో: సెర్చ్‌ తీరును ఇష్టమున్నట్టుగా నిర్ణయించుకోవటానికి గూగుల్‌కు చెందిన అడ్వాన్స్డ్‌ సెర్చ్‌ టూల్‌ ఉపయోగపడుతుంది. సైట్‌, ప్రాంతం, భాష, ఫైల్‌ రకం వంటి వివిధ అంశాలుగా విభజించి మొబైల్‌ బ్రౌజర్‌తో సెర్చ్‌ చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని