కుటుంబ పెద్ద అనుమతితో ఆధార్‌ చిరునామా మార్పు

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కుటుంబ పెద్ద అనుమతితో ఆన్‌లైన్‌లో వ్యక్తిగత చిరునామాలను మార్చుకునే సదుపాయాన్ని కల్పించింది.

Published : 11 Jan 2023 00:48 IST

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కుటుంబ పెద్ద అనుమతితో ఆన్‌లైన్‌లో వ్యక్తిగత చిరునామాలను మార్చుకునే సదుపాయాన్ని కల్పించింది. తల్లిదండ్రులు, జీవిత భాగస్వాముల వంటి వారి పేర్లు లేని సందర్భాల్లో ఇది పౌరులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఆన్‌లైన్‌లో ముందుగా కుటుంబ పెద్దను అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది.
* ముందుగా మై ఆధార్‌ వెబ్‌సైట్‌కు (https://myaadhaar.uidai.gov.in)  వెళ్లాలి.
* అప్‌డేట్‌ అడ్రస్‌ ట్యాబ్‌లో కుటుంబ పెద్దకు సంబంధించిన ఆధార్‌ నంబరును ఎంటర్‌ చేయాలి.
* దాన్ని యూఐడీఏఐ ధ్రువీకరించిన తర్వాత కుటుంబ పెద్దతో తమకు గల సంబంధాన్ని రుజువు చేసే పత్రాన్ని అప్‌లోడ్‌ చేయాలి.
* రూ.50 రుసుము చెల్లించి, కుటుంబ పెద్దకు చిరునామా మార్పు సేవ వినతి కోసం నంబరును పంపించొచ్చు. అది ఎస్‌ఎంఎస్‌ రూపంలో కుటుంబ పెద్ద ఫోన్‌కు చేరుతుంది.
* అలర్ట్‌ అందిన 30 రోజుల్లోపు కుటుంబ పెద్ద మై ఆధార్‌ వెబ్‌సైట్‌లో సైన్‌ ఇన్‌ అయ్యి ఆ రిక్వెస్ట్‌కు అనుమతి ఇవ్వచ్చు. తర్వాత అడ్రస్‌ మారుతుంది.

పిల్లల బయోమెట్రిక్‌ అప్‌డేట్‌

పిల్లల కోసం ప్రత్యేకించిన బాల్‌ ఆధార్‌కు సంబంధించి యూఐడీఏఐ ఇటీవల తాజా మార్గదర్శకాలనూ జారీచేసింది. దీని ప్రకారం పిల్లలకు ఐదేళ్లు, పదిహేనేళ్లు పడ్డాక బయో మెట్రిక్‌ (వేలిముద్రలు) సమాచారాన్ని అప్‌డేట్‌ చేయటం తప్పనిసరైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని