Medicover Hospital: బబుల్‌-హెడ్‌ డాల్‌ సిండ్రోమ్‌.. న్యూరో ఎండోస్కోపిక్‌ సర్జరీతో చిన్నారికి నూతన జీవితం

Eenadu icon
By Telangana News Team Published : 25 Nov 2025 20:53 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

రెజిమెంటల్‌బజార్: అత్యంత అరుదుగా వచ్చే బబుల్‌-హెడ్‌ డాల్‌ సిండ్రోమ్‌తో బాధపడుతున్న రెండున్నరేళ్ల చిన్నారికి న్యూరో ఎండోస్కోపిక్‌ సర్జరీతో నూతన జీవితాన్ని అందించినట్లు సికింద్రాబాద్‌ మెడికవర్‌ వైద్య నిపుణులు వెల్లడించారు. మంగళవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీనియర్‌ కన్సల్టెంట్‌ న్యూరో సర్జన్‌ రమేష్‌ శిఘకొల్లి, వైద్యనిపుణులు భవానీశంకర్‌ శ్రీనివాస్, ప్రదీప్‌ ఈ వివరాలు వెల్లడించారు. 

‘‘నగరంలోని ఎల్‌బీనగర్‌కు చెందిన దంపతుల రెండున్నరేళ్ల కుమారుడు పుట్టుకతోనే హైడ్రోసెఫలస్‌ కారణంగా అరుదుగా కనిపించే బబుల్‌ హెడ్‌ డాల్‌ సిండ్రోమ్‌ వ్యాధితో బాధపడుతున్నాడు. మెదడులో అనేక నీటి బుడగలు ఉండడంతో సాధారణ పిల్లల్లా స్పందించలేకపోవడంతో పాటు మానసిక స్థితి సరిగా ఉండట్లేదు. కొన్ని రోజుల కిందట చిన్నారి తల్లిదండ్రులు మా వద్దకు రాగా అతడిని పరీక్షించి మెదడులో అనేక నీటి బుడగలతో తీవ్రమైన ఒత్తిడి కారణంగానే ఈ సమస్య ఏర్పడినట్లు గుర్తించాం. బాలుడికి న్యూరో సర్జరీ బృందం న్యూరో నావిగేషన్‌తో కూడిన అధునాతన న్యూరో ఎండోస్కోపీ ద్వారా సర్జరీ చేసింది. దీర్ఘకాలిక నియంత్రణ కోసం వైద్యులు ప్రోగ్రామబుల్‌ వీపీ స్టంట్‌ను అమర్చారు. శస్త్రచికిత్స విజయవంతం కావడంతో బాలుడు కోలుకుంటున్నాడు’’అని వైద్యులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని