Weather Forecast: తెలంగాణలోనేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు!

ఆగ్నేయ భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండడం, వాయువ్య భారత ప్రాంత వాతావరణంలో నెలకొన్న అస్థిరత ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఒక మోస్తరు

Published : 10 Jan 2022 06:56 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఆగ్నేయ భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండడం, వాయువ్య భారత ప్రాంత వాతావరణంలో నెలకొన్న అస్థిరత ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఆదివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ 11 ప్రాంతాల్లో స్వల్పంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా బరంపూర్‌(ఆదిలాబాద్‌ జిల్లా)లో 2.2, దస్తురాబాద్‌(నిర్మల్‌)లో 1.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉష్ణోగ్రత సాధారణం కన్నా 3 డిగ్రీల వరకూ పెరగడంతో చలి తీవ్రత కొంత తగ్గింది. ఆదివారం తెల్లవారుజామున అత్యల్పంగా తాళ్లపల్లి(రంగారెడ్డి జిల్లా)లో 15.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గాలిలో తేమ సాధారణం కన్నా ఎక్కువగా ఉంటోంది. ఉదయం పూట దట్టంగా పొగమంచు కురుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని