Hyderabad News: విమానంలో 60 మంది.. 20 నిమిషాలు తీవ్ర కుదుపులు

హైదరాబాద్‌ లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తమిళనాడులోని తిరుచ్చి వెళ్తున్న విమానం ఒక్కసారిగా కుదుపులకు గురవడం కలకలం సృష్టించింది. పైలట్‌ చాకచాక్యంగా వ్యవహరించి గమ్యాన్ని చేర్చడంతో అందులోని ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు

Updated : 20 Mar 2022 10:20 IST

హైదరాబాద్‌ నుంచి తిరుచ్చి వెళ్తుండగా ఘటన

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: హైదరాబాద్‌ లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తమిళనాడులోని తిరుచ్చి వెళ్తున్న విమానం ఒక్కసారిగా కుదుపులకు గురవడం కలకలం సృష్టించింది. పైలట్‌ చాకచాక్యంగా వ్యవహరించి గమ్యాన్ని చేర్చడంతో అందులోని ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి తిరుచ్చి వెళ్తున్న విమానంలో ఈ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. సాయంత్రం ఆరు గంటలకు తిరుచ్చి వెళ్లాల్సిన ఇండిగో విమానం (6ఈ7213) అరగంట ఆలస్యంగా 6.30 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరింది. 40 నిమిషాల ప్రయాణం అనంతరం ఆకాశంలో ఉండగా విమానం తీవ్ర కుదుపులకు గురైంది. అందులో ప్రయాణిస్తున్న దాదాపు 60 మంది ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వారి సెల్‌ఫోన్లు, ఇతరత్రా వస్తువులు విమానంలో చెల్లాచెదురుగా పడిపోయాయి. 20 నిమిషాల తర్వాత కుదుపులు కాస్త తగ్గాయి. పైలట్‌ చాకచాక్యంగా వ్యవహరించి తిరుచ్చి ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని సురక్షితంగా దించారు. ఆకాశం బాగా మేఘావృతమై ఉండటంతోనే ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని