Covaxin: కొవాగ్జిన్‌ ఉత్పత్తి తాత్కాలికంగా తగ్గింపు: భారత్‌ బయోటెక్‌

తమ తయారీ కేంద్రాల్లో కొవాగ్జిన్‌ టీకా ఉత్పత్తిని తాత్కాలికంగా తగ్గించనున్నట్లు భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ శుక్రవారం ప్రకటించింది. టీకా సేకరణ సంస్థలకు ఒప్పందం మేర సరఫరాలు

Updated : 02 Apr 2022 07:25 IST

హైదరాబాద్‌: తమ తయారీ కేంద్రాల్లో కొవాగ్జిన్‌ టీకా ఉత్పత్తిని తాత్కాలికంగా తగ్గించనున్నట్లు భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ శుక్రవారం ప్రకటించింది. టీకా సేకరణ సంస్థలకు ఒప్పందం మేర సరఫరాలు పూర్తికావడం, టీకాకు గిరాకీ తగ్గుతుండటం ఇందుకు కారణాలుగా తెలుస్తోంది. టీకా తయారీ కేంద్రాల నిర్వహణ పనులు చేపట్టాల్సి ఉందని, ఈ సదుపాయాలను మరింత సమర్థంగా వినియోగించే ప్రక్రియలపైనా దృష్టి సారిస్తామని కంపెనీ తెలిపింది. కొవిడ్‌-19 అత్యవసర పరిస్థితుల్లో కొవాగ్జిన్‌ టీకాను భారీగా ఉత్పత్తి చేయడం కోసం తమ తయారీ కేంద్రాలన్నీ గత ఏడాది కాలంగా నిరంతరం పనిచేశాయని సంస్థ గుర్తు చేసింది. భారత్‌తో పాటు ప్రపంచ అవసరాల కోసం కోట్ల కొద్దీ డోసుల టీకా తయారు చేసినట్లు వివరించింది. కొవాగ్జిన్‌ టీకా నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడలేదని కంపెనీ స్పష్టం చేసింది. ఈ కేంద్రాల నవీకరణ ప్రక్రియ చేపట్టాల్సి ఉందని భారత్‌ బయోటెక్‌ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని