రికార్డు స్థాయిలో వేసవి రైళ్లు

వేసవి కాలంలో పెరిగే రాకపోకలకు అనుగుణంగా ఈసారి రికార్డు స్థాయిలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.

Published : 20 Apr 2024 04:41 IST

ద.మ.రైల్వేలో 1,012 ట్రిప్పులు

దిల్లీ: వేసవి కాలంలో పెరిగే రాకపోకలకు అనుగుణంగా ఈసారి రికార్డు స్థాయిలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది వేసవిలో 6,369 ట్రిప్పులు నడపగా ఈసారి దానిని 9,111కి పెంచినట్లు వెల్లడించింది. ప్రధాన రైలు మార్గాల్లో ఇబ్బందుల్ని తొలగించేరీతిలో 2,742 ట్రిప్పుల్ని పెంచినట్లయిందని తెలిపింది. అత్యధికంగా 1,878 ట్రిప్పులు పశ్చిమ రైల్వేలో ఉంటాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 1,012 ట్రిప్పులు తిరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, యూపీ, రాజస్థాన్‌, దిల్లీ, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల మీదుగా వేసవి రైళ్లు రాకపోకలు చేయనున్నాయి. ప్రసార మాధ్యమాల్లో వస్తున్న కథనాలతో పాటు రైల్వే సమీకృత హెల్ప్‌లైన్‌ (139) సహా వివిధ మార్గాల్లో అందిన సమాచారంతో నిర్దిష్ట మార్గాల్లో డిమాండును ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.

పెద్దఎత్తున ట్రాక్‌ పునరుద్ధరణ

ఈనాడు, హైదరాబాద్‌: రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణ పనుల్ని 2023-24 ఆర్థిక సంవత్సరంలో రికార్డుస్థాయిలో చేపట్టినట్లు ద.మ.రైల్వే తెలిపింది. జోన్‌ పరిధిలో 649 కి.మీ.ట్రాక్‌ని పునరుద్ధరించినట్లు తెలిపింది. వేసవి కాలంలో జోన్‌ పరిధిలో 1079 ట్రిప్పుల అదనపు రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. ఈ రైళ్లు ఏప్రిల్‌, మే నెలల్లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని