వేడుకగా ‘ది లాస్ట్‌ మహారాజా ఆఫ్‌ విజయనగరం’ పుస్తకావిష్కరణ

విజయనగరం జిల్లా కేంద్రంలోని పూసపాటి రాజుల కోటలో మాన్సాస్‌ ట్రస్టు వ్యవస్థాపకుడు డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి.

Updated : 02 May 2024 06:56 IST

తరలివచ్చిన పూసపాటి రాజ కుటుంబీకులు

విజయనగరం అర్బన్‌, న్యూస్‌టుడే: విజయనగరం జిల్లా కేంద్రంలోని పూసపాటి రాజుల కోటలో మాన్సాస్‌ ట్రస్టు వ్యవస్థాపకుడు డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆయన జీవిత చరిత్రపై రూపొందించిన ‘ది లాస్ట్‌ మహారాజా ఆఫ్‌ విజయనగరం’ పుస్తకావిష్కరణ కార్యక్రమం బుధవారం వేడుకగా జరిగింది. నగరంలోని సింహాచలం దేవస్థాన సత్రం విద్యార్థులు దీన్ని ఆవిష్కరించారు. తొలి పుస్తకాన్ని ట్రస్టు ఛైర్మన్‌ పూసపాటి అశోక్‌ గజపతిరాజుకు అందజేశారు. అనంతరం ప్రత్యేక ఆహ్వానితులు, రాజ కుటుంబానికి చెందిన వెంకటేష్‌ సింగ్‌, మధుకర్‌ షాజీ, తెరీ మహారాజ్‌, బి.పి.సింగ్‌కు ఇచ్చారు. గౌరవ అతిథులుగా హాజరైన పీవీజీ స్నేహితుడు, రష్యన్‌ ఉపాధ్యాయుడు రమేష్‌కుమార్‌ దోతీ, విశ్రాంత ప్రధానాచార్యుడు ఏవీడీ శర్మ ప్రసంగించారు. దేశం నలుమూలల నుంచి పూసపాటి కుటుంబ సభ్యులు విచ్చేసి ఉత్సాహంగా గడిపారు. హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌కు చెందిన రచయితలు గీతా రామస్వామి, శశికుమార్‌, పరమేశ్వరరావు, అశోక్‌గజపతిరాజు సతీమణి సునీలా గజపతిరాజు, కుమార్తెలు అదితి గజపతిరాజు, విద్యావతి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని