పంచాయతీల్లో కంపోస్టు ఎరువు తయారీ

తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయతీల్లో  తడి, పొడి చెత్తను వేరుచేసే ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని... నిరంతరాయంగా కంపోస్టు తయారీని కొనసాగించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్‌ సుల్తానియా ఆదేశించారు.

Published : 19 May 2024 02:07 IST

ముఖ్యకార్యదర్శి ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయతీల్లో  తడి, పొడి చెత్తను వేరుచేసే ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని... నిరంతరాయంగా కంపోస్టు తయారీని కొనసాగించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్‌ సుల్తానియా ఆదేశించారు. గ్రామాల్లోని వైకుంఠధామాలకు విద్యుత్తు, నీరు, మరుగుదొడ్ల సౌకర్యాలు కల్పించాలని సూచించారు. శనివారం ఆయన జిల్లా పంచాయతీ అధికారులతో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ నర్సరీ, డంపింగ్‌యార్డు, ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం, వైకుంఠధామాలను సక్రమంగా నిర్వహించాలన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు జిల్లాల్లో పర్యటించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని