Updated : 18 Jan 2022 04:13 IST

అయిందా... పెళ్ళి!

‘వెర్రి వెయ్యి విధాలని విన్నాను కానీ, జనం మరీ ఇంత వేలంవెర్రిగా ప్రవర్తిస్తారని అనుకోలేదు’
‘ఏమిటి...నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు. ఏమిటి విశేషం?’
‘ప్రతి దానికీ విశేషం ఉండి తీరాలేమిటి? అందరూ నీలాగే ప్రతిదాన్నీ విశేషంగా మార్చాలని అనుకోబట్టే విపరీతాలు, ప్రమాదాలు జరుగుతున్నాయి.’
‘ఇంతకీ ఏ విషయం గురించి నువ్వు మాట్లాడేది?’
‘ఒకటేమిటి? అన్నింటిలోనూ అతి ప్రవర్తనలే. నేటి పెళ్ళిళ్ల గురించే తీసుకో... మొన్నటికి మొన్న ఓ పెళ్ళి వేడుకలో వధూవరులు తుపాకీతో ఆకాశంలోకి కాల్పులు జరిపారట. ఆ గుండు గురి తప్పి ఎవరికైనా తగిలితే, ఎంత ప్రమాదం జరిగేది? అలాగే, ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో ఓ వధూవరుల జంట సినిమా శైలిలో క్రేన్‌ ద్వారా వేదికపైకి చేరుకోవాలని ఘనంగా ఏర్పాట్లు చేసుకున్నారు... చివరి నిమిషంలో క్రేన్‌ తీగ తెగి పన్నెండు అడుగుల పైనుంచి కింద పడిపోయారు... ఎవరికీ ప్రమాదం జరగలేదు కాబట్టి సరిపోయింది. అయినా ఇలాంటివి మన కాలంలో ఎరుగుదుమా?’
‘ఎందుకు ఎరగము? ఏ కాలానికి తగిన సరదాలు ఆ కాలంలో ఉన్నాయి’
‘వధూవరులను పల్లకిలో ఊరేగించడం ఒకనాటి ముచ్చటైతే, రిక్షాను హంస ఆకృతిలో అలంకరించి ఊరేగడం మరోనాటి సరదా! ఆ తరవాత కారుకు అలంకరణ చేసి ఊరేగడం ఒక ముచ్చట. ఇలా ఎన్నో... అలాగే తమ పెళ్ళిని వెరైటీగా జరుపుకోవాలని ఎవరికి వారే సరదా పడతారు’
‘మండపం మీద తిన్నగా కూర్చుని పెళ్ళి చేసుకోకుండా ఎందుకొచ్చిన వికారాలు ఇవి?’
‘అలా అనేస్తే ఎలా, వాళ్ల సరదా తీరేదెప్పుడు? ‘పుర్రెకో బుద్ధి- జిహ్వదో రుచి’ అన్నట్టు ఒక్కొక్కరిది ఒక్కొక్క సరదా. ఆ సరదాలు తీర్చుకోవడానికి తగిన సమయం పెళ్ళే. అందుకే పెళ్ళిళ్లలోనే ఇలాంటి ముచ్చట్లు’
‘అసలు ఇలాంటి వింత ఆలోచనలు ఎలా వస్తాయి వాళ్లకు?’
‘వాళ్లకు వచ్చేవి తక్కువే. కానీ ఇలాంటి సరదా రాయుళ్ల కోసం కొత్త కొత్త ఆలోచనలు సృష్టించి అమ్మకానికి పెట్టే ఏజెన్సీలు ఉంటాయి. ఆ ఆలోచనలకు కార్యరూపం ఇవ్వడానికి ప్యాకేజీల రూపంలో ఏర్పాట్లు చేసే సంస్థలూ ఉన్నాయి. అవే ఇలాంటివన్నీ చేసిపెడతాయి. వాటి కోసం వాళ్లు వసూలు చేసే రుసుము కూడా లక్షల రూపాయల్లోనే ఉంటుంది’
‘ఆలోచనలకు లక్షల రూపాయలా?’
‘పూర్వం కవిత్వం చెప్పినవారికి అక్షరలక్షలు ఇచ్చేవారని వినలేదూ? ఇదీ అలాంటిదే’
‘అదంటే మానసిక ఉల్లాసం కలిగిస్తుంది. ఇవేమిస్తాయి?’
‘ఇదీ అలాంటిదే. మారుతున్న కాలంతో పాటు జనం ఆలోచనలు, అభిరుచులు, సరదాలు కూడా మారుతూ ఉంటాయి. వాటికి అనుగుణంగా కొత్త ఆలోచనలు రెక్కలు తొడుక్కుంటాయి’
‘ఏమిటో ఆ కొత్తదనం’
‘ఆ ఆలోచనల ఫలితంగానే... విమానాల్లో విహరిస్తూ, జలాంతర్గాముల సాయంతో జలాల అడుగున, ప్రత్యేకంగా తయారు చేసిన బెలూన్ల సాయంతో ఆకాశవీధుల్లో, కదిలే రైలులో, గూడ్స్‌ రైలుపెట్టెల మీద, నీటిలో పడవల పైనా, చెట్టు కొమ్మలపైనా...పెళ్ళిళ్లు చేసుకున్నవారు కొందరైతే, మార్కెట్‌లో రహదారి కూడలిలో వృద్ధాశ్రమాల్లో, అనాథాశ్రమాల్లో వివాహాలు చేసుకున్న వారూ ఉన్నారు. ఇంకో వింత చెప్పమంటావా... శ్మశానాలు, ఎడారులు, అడవుల్లో పెళ్ళిళ్లు చేసుకోవడం కూడా నేటి క్రేజ్‌. ఇలాంటివి మనకు వింతగా అనిపిస్తాయి. వారికి మాత్రం థ్రిల్లింగ్‌గా ఉంటాయి.’
‘అదేమి మాయదారి థ్రిల్లింగ్‌రా, అందులో సరదా ఏమిటి’
‘ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. అందరికీ అన్నీ నచ్చవు. ఎవరి సంతృప్తి వారికి ప్రధానం. జీవితంలో జరిగే ముఖ్యమైన సంఘటన ఏదైనా జీవితాంతం గుర్తుండిపోయేలా, పదిమంది చెప్పుకొనేలా మలచుకోవాలనేది వారి కోరిక. కాకపోతే వీటిలో కూడా... సినిమాల్లా రచనల్లా కొన్ని హిట్‌ అవుతాయి. మరికొన్ని ప్లాప్‌ అవుతాయి’
‘ఆమాత్రం దానికి అంతలేసి డబ్బు తగలెయ్యడం ఎందుకు?’
‘ఇది మరీ బాగుంది. సరదాలు ఉచితంగా తీరతాయేమిటి మరి!’
‘సరే వాళ్ల డబ్బులు వాళ్ల ఇష్టం. కానీ వాటివల్ల సంభవించే ప్రమాదాల సంగతి గురించి కూడా ఆలోచించాలి కదా?’
‘ఆ మాటన్నావు నిజమే! అతి అన్ని చోట్లా విడిచి పెట్టాలి... అన్నారు పెద్దలు. ఏ పని చేసినా అది తీపి గుర్తుగా మిగిలిపోవాలి. చేదుజ్ఞాపకంలా మారకూడదు. మరీమరీ తలచుకుంటూ మురిసిపోయేలా ఉండాలి. అంతేకాని- జ్ఞాపకం వస్తేనే ఒళ్ళు జలదరించ కూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే...‘అయిందా పెళ్ళి?’ అని ఎగతాళి చేసేలా కాకుండా... ‘పెళ్ళి బాగా అయింది’ అనిపించేలా ఉండాలి. దానికి తగినట్లుగా అందరూ ప్రవర్తిస్తే మంచిది!’

- రమా శ్రీనివాస్‌

Read latest Vyakyanam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

‘ప్రాథమిక’ సంక్షోభం

‘ప్రాథమిక’ సంక్షోభం

నాణ్యమైన బడి చదువే బంగరు భవితకు నారుమడి. ప్రాథమిక దశలో మేలిమి బోధన పటిష్ఠ విద్యాసౌధానికి గట్టి పునాది వేస్తుంది. వ్యక్తి వికాసానికి బాటలు పరచి, భావి జీవిత గమనానికి స్ఫూర్తి రగిలించే బడి చదువులకు సంబంధించి దేశీయంగా నాణ్యతా ప్రమాణాల పతనం తీవ్రంగా ఆందోళనపరుస్తోంది.
తరువాయి

ప్రధాన వ్యాఖ్యానం

సాగుభూమిని మింగేస్తున్న పట్టణీకరణ

సాగుభూమిని మింగేస్తున్న పట్టణీకరణ

వ్యవసాయం ఆర్థికాభివృద్ధికి, ఆహార భద్రతకు ప్రాణాధారం. కానీ, సగటు రైతులకు వ్యవసాయం భారమైంది. రసాయన ఎరువులు, పురుగుమందుల విచ్చలవిడి వినియోగం, తగ్గుతున్న భూసారం తదితర కారణాలు దిగుబడులపై ప్రభావం చూపుతున్నాయి. దాంతో గ్రామాల నుంచి వలసలు పెరుగుతూ
తరువాయి

ఉప వ్యాఖ్యానం

సుదృఢ బంధమే ఉభయతారకం

సుదృఢ బంధమే ఉభయతారకం

ఆస్ట్రేలియాలో ఇటీవలి సాధారణ ఎన్నికల్లో లేబర్‌ పార్టీ అత్యధిక స్థానాలు సాధించింది. ఆ పార్టీ నాయకుడు ఆంటొనీ ఆల్బనీస్‌ (59) ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆస్ట్రేలియన్లకు ‘ఆల్బో’గా సుపరిచితులైన ఆయన ప్రధాని అయిన.....
తరువాయి
ఎన్‌కౌంటర్‌లో నేరం ఎవరిది?

ఎన్‌కౌంటర్‌లో నేరం ఎవరిది?

రెండేళ్ల క్రితం హైదరాబాద్‌ శివార్లలో ‘దిశ’పై అత్యాచారం, హత్య తరవాత దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. పోలీసులు, పాలకుల సామర్థ్యం, విశ్వసనీయతపై ప్రజలు, కొన్ని ప్రసార మాధ్యమాల నుంచి తీవ్ర ప్రశ్నలు ఎదురయ్యాయి. ‘
తరువాయి

అంతర్యామి

జీవితమంటే ఇవ్వడమే!

జీవితమంటే ఇవ్వడమే!

నువ్వు ఇవ్వదగినదేదో ఇవ్వు... అది వెయ్యింతలై తిరిగి నీకు దక్కుతుంది. కాని, నీ దృష్టి దాని మీదే ఉండకూడదు. ఇది స్వామి వివేకానంద సూక్తి.
తరువాయి
జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని