Updated : 30/06/2022 19:25 IST

పేల బాధ తగ్గాలంటే ఏం చేయాలి?

నాకు పాతికేళ్లు. నా తలలో పేలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎన్నిసార్లు దువ్వుకున్నా మళ్లీ మళ్లీ వస్తున్నాయి. ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి ఇంట్లోనే పాటించగలిగిన పరిష్కారం చెప్పండి. - ఓ సోదరి

జ. కొబ్బరి నూనె పావు లీటరు, వేప గింజలు కప్పు తీసుకోవాలి. ముందుగా కొబ్బరినూనెను సన్నని సెగ మీద 20 నిమిషాలు వేడి చేయాలి. ఆ తర్వాత పొయ్యి మీద నుంచి దించి నూనె వేడిగా ఉన్నప్పుడే వేప గింజలు వేసి వారం రోజుల పాటు కదపకుండా అలాగే ఉంచేయాలి. దీనివల్ల చేదుగా ఉండే నూనె తయారవుతుంది. దాన్ని తలకు అప్త్లె చేసి గంట తర్వాత తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉండాలి. నాలుగు నుంచి ఐదు వారాలు గడిచేసరికి తలలో పేలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి. ఈ నూనెను ఒకసారి తయారుచేసుకుంటే ఆరు నెలల వరకు ఉపయోగించవచ్చు. అయితే దీన్ని ఉపయోగించినన్ని రోజులు వేప గింజలను నూనెలో అలాగే ఉంచాలి. వేప గింజల్లో ఉండే చేదు గుణం వల్ల పేలు పోవడంతో పాటు.. తలలో ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉంటే అవి కూడా తగ్గుముఖం పడతాయి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని