అమెరికా పిల్లలకి ‘లెక్కలు’ రావడం లేదట!

అగ్రరాజ్యం అమెరికాను గణితం కలవరపెడుతోంది. దేశంలో గణితంలో నిష్ణాతులైన ఉద్యోగుల కొరత ఉందని పలు కంపెనీలు, యూనివర్సిటీలు తమ నివేదికల్లో పేర్కొన్నాయి.

Published : 29 Sep 2023 04:56 IST

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాను గణితం కలవరపెడుతోంది. దేశంలో గణితంలో నిష్ణాతులైన ఉద్యోగుల కొరత ఉందని పలు కంపెనీలు, యూనివర్సిటీలు తమ నివేదికల్లో పేర్కొన్నాయి. రాబోయే రోజుల్లో ఇదే తీరు కొనసాగితే జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించడంతోపాటు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పోటీపడలేమని కంపెనీల యాజమాన్యాలు, విద్యారంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యా వ్యవస్థకు తమ వంతు చేయూత అందించేందుకు అమెరికా రక్షణశాఖ సైన్స్‌, టెక్నాలజీ, గణితం పేరుతో ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తోంది. ఓ నివేదిక ప్రకారం అమెరికన్లలో స్టెమ్‌ కళాశాల గ్రాడ్యుయేట్లతో పోలిస్తే చైనాలో 8, రష్యాలో 4 రెట్లు ఎక్కువ మంది ఉన్నారట. మరోవైపు సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామింగ్‌ నుంచి సెమీ కండక్టర్‌ తయారీ వరకూ ప్రతి రంగంలో గణితం అవసరముందని, కానీ ఆ రంగంలో నైపుణ్యం కలిగిన ఉద్యోగులు లేరని టెన్నెస్సీ టెక్‌ యూనివర్సిటీ పేర్కొంది. ఇది కేవలం విద్యా రంగానికి సంబంధించిన అంశం కాదని, కొన్ని రంగాల్లో అమెరికా ఎదుర్కొంటున్న ప్రాథమిక సవాళ్లను అధిగమించేందుకు గణితం అవసరముందని అంటున్నారు. అమెరికాలో పలు కీలక రంగాలకు విదేశాల నుంచి విద్యార్థులుగా వచ్చి ఉద్యోగులుగా మారినవారు నాయకత్వం వహిస్తున్నారని తేలింది. తాజా గణాంకాల ప్రకారం అమెరికాలోని పలు యూనివర్సిటీల్లో గణితం ఇంటెన్సివ్‌ సబ్జెక్టుగా కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చదివే ప్రతి ఐదుగురిలో ఒక్కరే అమెరికన్‌ ఉన్నారట.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని