HIV: మూలకణ మార్పిడితో హెచ్‌ఐవీ నుంచి మహిళకు విముక్తి!

హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నిర్మూలనకు జరుగుతున్న పరిశోధనల్లో మరో ఆశావహ ముందడుగు! అమెరికాలో లుకేమియా బాధిత మహిళ ఒకరు మూలకణ మార్పిడి ద్వారా హెచ్‌ఐవీ నుంచి విముక్తి

Updated : 17 Feb 2022 07:44 IST

వాషింగ్టన్‌: హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నిర్మూలనకు జరుగుతున్న పరిశోధనల్లో మరో ఆశావహ ముందడుగు! అమెరికాలో లుకేమియా బాధిత మహిళ ఒకరు మూలకణ మార్పిడి ద్వారా హెచ్‌ఐవీ నుంచి విముక్తి పొందారు. ఇలా స్వస్థత పొందినవారిలో ఆమె మూడో వ్యక్తి కాగా, మహిళల్లో మొదటివారు. ‘రెట్రోవైరస్‌లు-అంటువ్యాధులు’పై మంగళవారం నిర్వహించిన సదస్సులో పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. కార్డ్‌ స్టెమ్‌సెల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ విధానంలో హెచ్‌ఐవీ నుంచి విముక్తి పొందవచ్చని నిర్ధారణకు వచ్చినట్టు వారు ప్రకటించారు. జాన్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ, మెటర్నల్‌ పీడియాట్రిక్‌ అడోలెసెంట్‌ ఎయిడ్స్‌ క్లినికల్‌ ట్రయల్‌ నెట్‌వర్క్‌ (ఇంపాక్ట్‌), యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు ఈ కేసులో పరిశోధన సాగించారు. ఇంపాక్ట్‌ సంస్థ 2015 నుంచి మొత్తం 25 మంది హెచ్‌ఐవీ బాధితులపై పరిశోధనలు సాగిస్తోంది. ఈ క్రమంలో- నాలుగేళ్లుగా హెచ్‌ఐవీతో బాధపడుతూ, యాంటీ రిట్రోవైరల్‌ థెరపీ (ఏఆర్‌టీ) తీసుకుంటున్న మహిళకు శాస్త్రవేత్తలు 2017లో కార్డ్‌ బ్లడ్‌ మూలకణ మార్పిడి చికిత్స అందించారు. వంద రోజుల తర్వాత పలుమార్లు పరీక్షించగా, ఆమెలో అసలు హెచ్‌ఐవీ జాడే కనిపించలేదు! దీంతో 37వ నెలలో ఏఆర్‌టీని నిలిపివేశారు. కీమో థెరపీ ద్వారా తీవ్రమైన మైలోయిడ్‌ లుకేమియా నుంచి కూడా ఆమెకు ఉపశమనం లభించడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని