అటు చర్చల మంత్రం ఇటు యుద్ధ తంత్రం

రష్యా-ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలకు సంబంధించి పరిస్థితి నెయ్యమా.. కయ్యమా అన్నట్లుంది. ఓ వైపు యుద్ధాన్ని నివారించేంద]ుకు దౌత్యపరంగా ప్రయత్నాలు సాగుతుంటే.. మరోవైపు సరిహద్దుల్లో తీవ్ర ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు

Published : 22 Feb 2022 04:56 IST

ఒకవైపు చర్చలు.. మరోవైపు ఉద్రిక్తతలు
పుతిన్‌తో భేటీకి బైడెన్‌ అంగీకారం
ఎటూ తేల్చని మాస్కో  
సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు
ఐదుగురు ఉక్రెయిన్‌ సైనికుల్ని చంపేశామన్న రష్యా  

వాషింగ్టన్‌,మాస్కో: రష్యా-ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలకు సంబంధించి పరిస్థితి నెయ్యమా.. కయ్యమా అన్నట్లుంది. ఓ వైపు యుద్ధాన్ని నివారించేంద]ుకు దౌత్యపరంగా ప్రయత్నాలు సాగుతుంటే.. మరోవైపు సరిహద్దుల్లో తీవ్ర ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ చొరవతో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలకు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ అంగీకరించారు. ఇదో సానుకూల పరిణామమని అందరూ భావిస్తున్న తరుణంలో.. తమ భూభాగంలోకి చొరబడిన ఐదుగురు ఉక్రెయిన్‌ చొరబాటుదారులను మట్టుబెట్టామని రష్యా ప్రకటించింది. ఆ దేశ సైనిక వాహనాలనూ నాశనం చేశామని పేర్కొంది. మరో కీలక పరిణామమూ చోటు చేసుకుంది. 2014 నుంచి ఉక్రెయిన్‌లోని తూర్పు ప్రాంతంలో రష్యా అనుకూల వేర్పాటు వాదుల గుప్పిట్లో ఉన్న డొనెట్స్క్‌, లుగాన్స్క్‌లను అధికారికంగా గుర్తించేంద]ుకు మాస్కో పావులు కదుపుతోంది. తమను గుర్తించమంటూ ఆ ప్రాంతాలు చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తామని పుతిన్‌ పేర్కొన్నారు. ఇది పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చే అవకాశాలు ఉన్నాయి.

చర్చలకు సరే.. కానీ

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ ఆదివారం అటు బైడెన్‌.. ఇటు పుతిన్‌తో సుదీర్ఘంగా ఫోన్‌లో మంతనాలు సాగించారు. చివరకు ఇరువురు నేతలను భేటీకి అంగీకరించేలా చేశారు. అయితే శిఖరాగ్ర సదస్సు జరిగేలోపు ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయకూడదని బైడెన్‌ షరతు విధించారు. దీనికి అంగీకరిస్తేనే తాను పుతిన్‌తో చర్చలు జరుపుతానని స్పష్టం చేశారు.  బైడెన్‌ చర్చలకు అంగీకరించినా.. ఈ భేటీపై  రష్యా అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ భిన్నంగా స్పందించడం విశేషం. ఇప్పటికైతే శిఖరాగ్ర సదస్సుపై ఎలాంటి అవగాహన కుదరలేదన్నట్లు మాట్లాడారు.

రష్యావన్నీ అబద్ధాలే..!

సరిహద్దులో ఉక్రెయిన్‌ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని రష్యా సోమవారం పేర్కొంది. తమ దేశంలోకి చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించిన ఐదుగురు ఉక్రెయిన్‌ సైనికులను హతమార్చామని తెలిపింది. రస్తోవ్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పేర్కొంది. అయితే రష్యా అబద్ధాలను ప్రచారం చేస్తోందని ఉక్రెయిన్‌ ఆరోపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని