Iraq: పెళ్లి వేడుకలో విషాదం.. అగ్నిప్రమాదంలో 100 మందికి పైగా మృతి

ఇరాక్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన వివాహ వేడుకలో ఈ ఘటన జరిగింది. 100 మందికి పైగా మృతి చెందినట్లు స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి.

Updated : 27 Sep 2023 14:36 IST

మొసూల్‌: ఇరాక్‌ (Iraq)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ పెళ్లి వేడుకలో పేల్చిన బాణసంచా కారణంగా ఘోర అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకొని 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇరాక్‌లోని నినెవేహ్‌ ప్రావిన్స్‌లో మంగళవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం..

హమ్‌దానియా ప్రాంతంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో నిన్న రాత్రి పెళ్లి వేడుక జరుగుతుండగా ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. చూస్తుండగానే అవి హాల్‌ అంతా వ్యాపించాయి. దీంతో ఈ వేడుకలో పాల్గొన్న అతిథులు, కుటుంబసభ్యులు అందులో చిక్కుకుపోయారు. సమాచారమందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

నెల్సన్‌ మండేలా మనవరాలు కన్నుమూత

ఈ దుర్ఘటనలో 114 మంది ప్రాణాలు కోల్పోయినట్లు నినెవేహ్‌ ప్రావిన్స్‌ ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరో 150 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

టపాసుల పేల్చడంతో..

ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత రాలేదు. అయితే, పెళ్లి వేడుకలో పేల్చిన బాణసంచా కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు స్థానిక మీడియా వర్గాలు పేర్కొన్నాయి. వేడుక జరుగుతున్న సమయంలో కొందరు టపాసులను పేల్చారు. ఈ క్రమంలోనే షాండ్లియర్‌కు మంటలు అంటుకున్న క్షణాల్లో వ్యాపించినట్లు సదరు వర్గాలు తెలిపాయి. ఘటన సమయంలో వధూవరులు స్టేజీపై డ్యాన్స్‌ చేస్తున్నారు. ప్రమాదంలో వారు కూడా గాయపడినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు