Zoleka Mandela: నెల్సన్‌ మండేలా మనవరాలు కన్నుమూత

నల్లజాతి సూరీడు నెల్సన్‌ మండేలా మనవరాలు జొలేకా మండేలా చనిపోయారు. రచయిత, ఉద్యమకారిణి అయిన జొలేకా క్యాన్సర్‌ చికిత్స పొందుతూ కన్నుమూశారు. 

Updated : 27 Sep 2023 06:43 IST

దక్షిణాఫ్రికా: జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన నల్లజాతి సూరీడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్‌ మండేలా(Nelson Mandela) మనవరాలు జొలేకా మండేలా(43) చనిపోయారు. రచయిత, ఉద్యమకారిణి అయిన జొలేకా రొమ్ము క్యాన్సర్‌(Breast Cancer)తో పోరాడుతూ కన్నుమూశారు. ‘‘క్యాన్సర్‌ చికిత్స కోసం ఈ నెల 18న జొలేకా మండేలా ఆసుపత్రిలో చేరారు. ఊపిరితిత్తులతో పాటు ఆమె శరీరంలోని ప్రధాన భాగాలకు క్యాన్సర్‌ కణాలు వ్యాపించాయి. దీంతో సోమవారం సాయంత్రం ఆమె కన్నుమూశారు. ఇన్ని రోజులు ఆమెను జాగ్రత్తగా చూసుకున్న వైద్య బృందానికి ధన్యవాదాలు’’ అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు వెలువడింది. 

1980లో జన్మించిన జొలేకా మండేలా తన చివరి శ్వాస వరకు రచయితగా, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తగా, న్యాయంకోసం ప్రజాగళం వినిపించిన ఉదమ్యకారిణిగా పనిచేశారు. జొలేకా మండేలాకు నలుగురు పిల్లలున్నారు. తనకు క్యాన్సర్‌ సోకడంతో దానికి సంబంధించిన చికిత్స, తన చిన్నతనంలో లైంగిక వైధింపులు, డ్రగ్స్‌కు అలవాటు తదితర అంశాలపై ఇటీవలే డాక్యుమెంట్‌లో పేర్కొన్నారు. జొలేకా మండేలా మృతి పట్ల నెల్సన్‌ మండేలా ఫౌండేషన్‌ సంతాపం తెలిపింది. 32 ఏళ్ల వయసులో తొలిసారి ఆమెకు క్యాన్సర్‌ సోకడంతో చికిత్స చేయించుకున్నారు. అనంతరం 2016లో మళ్లీ క్యాన్సర్‌ తిరగబెట్టింది.  

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని