Viral Video: పిల్లి కూన అనుకొని చేరదీసిన మహిళ.. చివరికి అసలు విషయం తెలిసి..

ఓ రష్యన్‌ మహిళ రోజుల వయసున్న పెంపుడు పిల్లి పిల్ల అనుకొని చేరదీస్తే కొన్నిరోజుల ఆమెకు నిజం తెలిసి ఆశ్చర్యానికి గురైంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాలో చక్కర్లు కొడుతోంది. 

Updated : 26 Sep 2023 04:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జంతువులు అంటే కొందరికి ఎనలేని ఇష్టం. వాటి సంరక్షణ కోసం ఎంతో కృషి చేస్తుంటారు. అయితే ఓ జంతు ప్రేమికురాలు అచేతనావస్థలో ఉన్న పిల్లి కూన అనుకొని చేరదీస్తే కొన్ని రోజులకు ఆమెకు అసలు విషయం తెలిసి కంగుతింది. అనంతరం సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. రష్యాకు చెందిన ఓ మహిళ రోడ్డు వెంట నడుస్తున్న క్రమంలో చెట్ల పొదల్లో అచేతనావస్థలో రోజుల వయసున్న ఓ పసి కూనను గుర్తించింది. తొలుత పెంపుడు పిల్లి పిల్ల అనుకుని తన వెంటతీసుకెళ్లి సపర్యలు చేసింది. తన పెంపుడు కుక్కతో పాటే దానికి ఆహారం అందించి చేరదీసింది. అయితే అది పెద్దదయ్యే క్రమంలో అది పిల్లి కాదని, బ్లాక్‌ పాంథర్‌(నల్ల చిరుత) అని గ్రహించి ఆశ్చర్యానికి గురైంది. అనంతరం దాన్ని తనతోపాటే ఉంచుకొని అనుబంధం పెంచుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తొలుత బ్లాక్‌ పాంథర్‌ దొరికిన స్థితి నుంచి అది పెరిగి పెద్దదయి ఆడుకుంటున్న వరకు అన్నింటిని కలిపి చేర్చిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో చక్కర్లు కొడుతోంది. దీంతో ఆ వీడియోకు తెగ లైక్‌లు వస్తున్నాయి. ఇప్పటికే ఈవీడియోకు మిలియన్లలో వ్యూస్‌ వచ్చాయి. మరోవైపు సదరు రష్యా మహిళ తన పెంపుడు కుక్క, బ్లాక్‌ పాంథర్‌తో తనకున్న అనుబంధాన్ని చాటేలా ఇన్‌స్టాలో ఖాతా తెరిచి వీడియోలు పోస్టు చేస్తోంది. ప్రస్తుతం ఈ ఖాతాను 35 లక్షల మంది అనుసరిస్తున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని