Ukraine Crisis: రష్యా చమురుపై ఆధారపడొద్దు

ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా నుంచి చమురును కొనుగోలు చేయొద్దని ఐరోపా దేశాలకు పదే పదే చెబుతున్న అమెరికా.. ఆ దిశగా కీలకమైన అడుగు వేసింది. చమురు సరఫరా విషయంలో

Updated : 26 Mar 2022 06:28 IST

మేమే సరఫరా చేస్తాం

ఐరోపాకు అమెరికా హామీ

బ్రస్సెల్స్‌: ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా నుంచి చమురును కొనుగోలు చేయొద్దని ఐరోపా దేశాలకు పదే పదే చెబుతున్న అమెరికా.. ఆ దిశగా కీలకమైన అడుగు వేసింది. చమురు సరఫరా విషయంలో ఐరోపా సమాఖ్య (ఈయూ)తో అవగాహనకు వచ్చింది. అందులో భాగంగా ఈ ఏడాది అదనంగా 15 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల ద్రవ సహజ వాయువును ఈయూకి ఎగుమతి చేస్తామని తెలిపింది. ఈ తాజా ఒప్పందంతో ఐరోపా.. రష్యాపై ఆధారపడటం తగ్గుతుందని  అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఐరోపా కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్‌ లియాన్‌తో చర్చించారు. ఐరోపాకు 40 శాతం ఇంధనం రష్యానే సరఫరా చేస్తోంది. బైడెన్‌ తాజా ప్రకటనతో ఐరోపా ఇంధన అవసరాలు తీరడం అనుమానమేనని నిపుణులు చెబుతున్నారు. అందుకే రష్యా చమురును నిషేధించే విషయంలో ఐరోపా దేశాలు ఆచితూచి స్పందిస్తున్నాయి. జర్మనీ, ఇటలీ, బల్గేరియాలు రష్యాపై ఎక్కువ ఆధారపడి ఉన్నాయి. ఒక్కసారిగా మాస్కోపై నిషేధం విధిస్తే తమ దేశంలో వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోతారని, ఇంధన కొరత కూడా ఏర్పడుతుందని జర్మనీ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని