Human Barbie: హ్యూమన్‌ బార్బీగా మారిన యువతి.. కొత్త అవతారానికి రూ.53.60 లక్షల ఖర్చు

జర్మనీకి చెందిన ఈమె పేరు... జెస్సీ బన్నీ. వయసు 21. ‘హ్యూమన్‌ బార్బీ’గా మారాలన్న తన కలను నిజం చేసుకోవడానికి సొంత కుటుంబాన్ని వదిలి ఆస్ట్రియాలోని వియెన్నాకు వచ్చేసింది. సుమారు రూ.53.60 లక్షలు (70 వేల డాలర్లు)

Updated : 04 May 2022 09:09 IST

ర్మనీకి చెందిన ఈమె పేరు... జెస్సీ బన్నీ. వయసు 21. ‘హ్యూమన్‌ బార్బీ’గా మారాలన్న తన కలను నిజం చేసుకోవడానికి సొంత కుటుంబాన్ని వదిలి ఆస్ట్రియాలోని వియెన్నాకు వచ్చేసింది. సుమారు రూ.53.60 లక్షలు (70 వేల డాలర్లు) వెచ్చించి మూడుసార్లు రొమ్ము పెరుగుదల శస్త్రచికిత్సలు చేయించుకుంది. పెదాలను, పిరుదులను బొద్దుగా మార్చుకుంది. ఇన్‌స్టాగ్రాం ఖాతాలో తన శరీర కొలతలను వెల్లడించింది. అయితే, రూపు మార్చుకున్న తర్వాత కుటుంబ సభ్యులెవరూ తనతో మాట్లాడటం లేదని వాపోయింది. డ్రైవింగ్‌ తరగతుల నిమిత్తం తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులను కూడా రొమ్ము పెరుగుదల చికిత్సకు వెచ్చించినట్టు చెప్పిన జెస్సీ... తాను ఇప్పుడెంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నానని, త్వరలోనే పూర్తిస్థాయి బేబీ డాల్‌ మాదిరి కనిపించేలా శరీరాన్ని మార్చుకుంటానని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని