KTR: మంచి మనసు చాటుకున్న కేటీఆర్‌.. పేదింటి విద్యార్థినికి ఆర్థిక సాయం

తాజా వార్తలు

Published : 26/08/2021 01:23 IST

KTR: మంచి మనసు చాటుకున్న కేటీఆర్‌.. పేదింటి విద్యార్థినికి ఆర్థిక సాయం

హైదరాబాద్‌: పేద విద్యార్థినికి ఆర్థిక సాయం అందించి మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌. వరంగల్ జిల్లా హసన్‌పర్తికి చెందిన విద్యార్థిని మేకల అంజలి రెండేళ్ల క్రితం ఐఐటీలో సీటు సాధించారు. పేదరికం, ఆర్థిక సమస్యల కారణంగా చదువును కొనసాగించేందుకు ఇబ్బంది పడుతున్నానని, ఆర్థిక సాయం చేయాలని మంత్రి కేటీఆర్‌ని గతంలో అభ్యర్థించారు. అంజలి కుటుంబ పరిస్థితి తెలుసుకున్న కేటీఆర్ వ్యక్తిగతంగా  గత రెండేళ్లుగా ఆమె ఫీజులకు అవసరమైన డబ్బులు అందజేశారు. ఈ ఏడాదికి, రానున్న సంవత్సరానికి సంబంధించిన ఫీజు మొత్తాన్ని ఇవాళ ప్రగతిభవన్‌లో అంజలి కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా అంజలి చదువు, భవిష్యత్ ప్రణాళికల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఆమె తన చదువు దిగ్విజయంగా పూర్తి చేసుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కేటీఆర్‌ ఆకాంక్షించారు. తమ  కుమార్తె చదువుకు ఆర్థిక సాయాన్ని అందించడం పట్ల అంజలి కుటుంబం కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని