వృద్ధులకు ఉబర్‌ ఉచిత క్యాబ్‌ సేవలు

ప్రధానాంశాలు

వృద్ధులకు ఉబర్‌ ఉచిత క్యాబ్‌ సేవలు

హెల్పేజ్‌ ఇండియాతో కలిసి శ్రీకారం

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: అత్యవసర పనులపై ప్రయాణించే వయోవృద్ధులకు ఉబర్‌ ఉచిత క్యాబ్‌ సేవలు అందించనుంది. హెల్పేజ్‌ ఇండియా సంస్థతో కలిసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బ్యాంకు, సూపర్‌మార్కెట్‌, ఆసుపత్రి, డయాగ్నస్టిక్‌ సెంటర్‌, రైల్వేస్టేషన్‌, బస్టాప్‌తో పాటు ఇతర పనుల కోసం వెళ్లే వృద్ధులకు, ఇద్దరు సహాయకులకు ఈ వెసులుబాటు కల్పించింది. హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం నగరాల్లో ఈ సేవలను అందిస్తున్నట్లు హెల్పేజ్‌ ఇండియా ప్రకటించింది. సాధారణ యాప్‌ ద్వారా బుక్‌ చేస్తే ఈ సేవలు పొందే అవకాశం లేదు. హెల్పేజ్‌ ఇండియా వయో వృద్ధుల సహాయ కేంద్రానికి ఫోన్‌ చేసి వివరాలు చెబితే రైడ్‌ను బుక్‌ చేస్తారు. ఉచిత క్యాబ్‌ సేవల కోసం 1800 180 1253 నంబరును సంప్రదించాలి. ఏవైనా సమస్యలుంటే 83419 94223 లేదా 90102 09041 నంబర్లకు ఫోన్‌ చేయవచ్చు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని