పూర్తిగా నిండిన సాగర్‌

ప్రధానాంశాలు

పూర్తిగా నిండిన సాగర్‌

నాగార్జునసాగర్‌, న్యూస్‌టుడే: ఎగువ నుంచి వారం రోజులుగా వస్తోన్న వరదతో నాగార్జునసాగర్‌ జలాశయం పూర్తిస్థాయిలో నిండింది. బుధవారం సాయంత్రం వరకు ప్రవాహం తక్కువగా ఉండటంతో రెండు క్రస్టు గేట్లను ఎత్తిన అధికారులు.. రాత్రి 8 గంటల తర్వాత శ్రీశైలం నుంచి వరద పెరగడంతో 4 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం రాత్రి 7 గంటల వరకు శ్రీశైలం నుంచి 1,40,856 క్యూసెక్కుల వరద రాగా.. 8 గంటల తర్వాత ప్రవాహం 1,57,596 క్యూసెక్కులకు చేరింది. ఈ క్రమంలో 4 క్రస్టు గేట్లను 5 అడుగుల మేరకు ఎత్తి 32,148 క్యూసెక్కులు.. కుడి, ఎడమకాల్వలు, ప్రధాన విదుత్కేంద్రం, ఎస్‌ఎల్బీసీ, వరదకాల్వ ద్వారా మొత్తం 74,596 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుస్తున్నారు. జలాశయ నీటిమట్టం 589.30 (గరిష్ఠం 590) అడుగులకు చేరింది. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలకు 310 టీఎంసీల నిల్వను కొనసాగిస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి 2,17,737 క్యూసెక్కుల వరద వస్తుండగా 4 క్రస్టు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 1,11,384.. విద్యుత్కేంద్రాల ద్వారా 62,665 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. సాగర్‌ కుడికాల్వ పరిధిలో సాగునీటి కోసం బుధవారం మధ్యాహ్నం విద్యుత్‌కేంద్రం ద్వారా 4,507 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని