టెస్కాబ్‌కు 4 ఉత్తమ పురస్కారాలు

ప్రధానాంశాలు

టెస్కాబ్‌కు 4 ఉత్తమ పురస్కారాలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంకు (టెస్కాబ్‌) ఉత్తమ పనితీరుకు 4 విభాగాల్లో జాతీయ పురస్కారాలు అందుకుంది. జాతీయ స్థాయిలో ఈ నెల 23న నిర్వహించిన జాతీయ సహకార బ్యాంకుల సదస్సులో ‘బ్యాంకింగ్‌ ఫ్రాంటియర్స్‌’ సంస్థ ఈ పురస్కారాలను ప్రకటించింది. సదస్సులో పాల్గొన్న కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ భగవత్‌ కిషన్‌రావు కరాడ్‌ ఆన్‌లైన్‌ ద్వారా తమకు వీటిని అందజేశారని టెస్కాబ్‌ ఎండీ నేతి మురళీధర్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా సహకార బ్యాంకుల పనితీరును మదింపు చేసి ఈ పురస్కారాలు అందజేస్తారని, ఇందులో టెస్కాబ్‌.. ఉత్తమ సహకార బ్యాంకు, ఉత్తమ మానవ వనరుల విభాగం, ఉత్తమ ఎన్‌పీఏ నిర్వహణ, ఉత్తమ పెట్టుబడుల చొరవ విభాగాల్లో అవార్డులకు ఎంపికైందని ఆయన వివరించారు. టెస్కాబ్‌ ఛైర్మన్‌ కొండ్రు రవీందర్‌రావు చొరవ, ఉద్యోగుల సమష్టి కృషితోనే అవార్డులు దక్కాయని చెప్పారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని