ఇటు వరద నీళ్లు..అటు పసిపిల్లలు.. అందుకే ఆగలేదు వీళ్లు

ప్రధానాంశాలు

ఇటు వరద నీళ్లు..అటు పసిపిల్లలు.. అందుకే ఆగలేదు వీళ్లు

విధి నిర్వహణ ముందు వారికి వాగు దాటడం కష్టం అనిపించలేదు. ప్రమాదమని తెలిసినా వైద్య సిబ్బంది.. చిన్నారులకు టీకాలు ఇచ్చేందుకు ముందుకే వెళ్లారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు మండలం దంతనపల్లి జెండగూడ సమీపంలోని వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శనివారం దంతనపల్లి పీహెచ్‌సీ సిబ్బంది ఏఎన్‌ఎం పావని, అనసూయ, ఆశా కార్యకర్త జెండాగూడలో చిన్నారులకు టీకాలు వేసేందుకు బయల్దేరారు. వాగులో ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కొద్దిసేపు అక్కడే నిరీక్షించారు. అనంతరం ఎస్సై సుబ్బారావు సాయంతో వాగు దాటి జెండాగూడకు వెళ్లారు. ప్రతి శనివారం ఒక్కో గిరిజన గ్రామంలో పిల్లలకు టీకాలు వేస్తామని ఏఎన్‌ఎం పావని తెలిపారు. ఇప్పుడు వేయకపోతే మళ్లీ నెలరోజుల వరకు ఇటువైపు రావడానికి వీలు కాదని, అందుకే ప్రమాదమని తెలిసినా వాగు దాటాల్సి వచ్చిందని చెప్పారు.

-న్యూస్‌టుడే, ఉట్నూరు గ్రామీణం


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని