మనసు మళ్లాలంటే...
close
Published : 10/07/2021 01:12 IST

మనసు మళ్లాలంటే...

కొన్ని పదార్థాలు ఒంటికి పడవు. అధిక బరువు, అనారోగ్యాలకు మూలమవుతాయనీ తెలుసు. అయినా మనసు మాత్రం లాగేస్తుంటుంది. ఆగలేక తినేస్తుంటారు. మీదీ అదే తీరా? దాన్ని తప్పించుకోవాలంటే...

* తీపి తినాలనిపిస్తే... చాక్లెట్లు, తీపి పదార్థాలు తినాలనిపిస్తే ఓ బెల్లం ముక్క తినండి. లేదంటే కిస్‌మిస్‌, ఖర్జూరా, అంజీరా వంటివీ ఎంచుకోవచ్చు. వీటిలో మినరళ్లూ, ప్రొటీన్లూ, విటమిన్లూ, పీచు అధికం. జీడిపప్పు, బాదం, వేరుసెనగ వంటి వాటికి బెల్లం కలిపీ తినొచ్చు.


* కూల్‌డ్రింక్స్‌ తాగాలనిపిస్తే... నిమ్మరసం మేలు. ఓట్స్‌ని జావలా కాచి పండ్ల ముక్కలూ, డ్రైఫ్రూట్స్‌ పలుకుల్ని వేసుకునీ తాగొచ్చు. నాలుక రుచి తప్పినట్టు అనిపిస్తే... యాపిల్‌, బొప్పాయి, నారింజ రసాలకి ప్రాధాన్యం ఇవ్వొచ్చు.


* చిరుతిళ్లకు బదులుగా... చల్లటి వాతావరణంలో రోడ్డు పక్కన దొరికే చాట్‌, కట్లెట్‌, పానీపూరీ, సమోసా, బజ్జీలు వంటివి తినాలనిపిస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వాటి జోలికి పోకపోవడమే మంచిది. వీలైతే మొలకలతో చాట్‌ చేసుకోండి. వేడివేడిగా ఉడికించిన సెనగలు, ఉలవలు, సోయా వంటి వాటితో కూడా ప్రయత్నించొచ్చు. వీటికి కాస్త పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, నిమ్మరసం చేరిస్తే వదిలిపెట్టరు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని