చీరను తినేసింది!
close
Published : 25/08/2021 01:51 IST

చీరను తినేసింది!

ఓనం.. కేరళ సంప్రదాయ పండుగ. ఈసారి దీన్ని ప్రత్యేకంగా నిర్వహించు కోవాలనుకుంది అన్నా ఎలిజబెత్‌ జార్జ్‌. అందు కోసం తనే చీరని తయారు చేసుకుంది. తర్వాత దాన్ని ఎంచక్కా ‘తినేసింది!’ మీరు చదివింది నిజమే! అన్నా తయారు చేసింది ‘ఎడిబుల్‌ శారీ’ మరి! కేకులు, మిఠాయిలు ఇదివరకే చీరల రూపంలో వచ్చాయి. దీనిలో కొత్తేముంది అనుకుంటున్నారా? కానీ దీన్ని కట్టుకునేలా రూపొందించింది. అదీ ప్రత్యేకత.

అన్నాది కొల్లం. క్యాన్సర్‌ అండ్‌ న్యూరో బయాలజీలో పీహెచ్‌డీ చేస్తోంది. హోం బేకర్‌, ఫ్లోరిస్ట్‌. ఇంట్లోనే కేక్‌లను చేసి, ఆన్‌లైన్‌లో అమ్ముతుంది. ఈసారి ఓనంకి కొత్తగా ప్రయత్నించాలనుకుంది. పీహెచ్‌డీ, బేకింగ్‌ పనుల్లో మునిగి చీర కొనుక్కోలేదన్న విషయం గుర్తొచ్చింది. భిన్నమైన, అందమైన చీరను తీసుకోవాలనుకుంది. అప్పుడే తినగలిగే చీరనే రూపొందిస్తే అన్న ఆలోచన వచ్చింది. అలాంటి చీరను ఇప్పటి దాకా ఎవరూ తయారు చేయలేదు. అందుకని తనే ప్రయత్నించాలనుకుంది. తను పరిశోధన చేస్తున్న సెల్‌ బయాలజీ టెక్నిక్‌లను దీనిలో ఉపయోగించింది. సంప్రదాయాన్నీ ప్రతిబింబించాలని కేరళ చేనేత వస్త్రం కసవును పోలేలా బంగారు బోర్డర్‌తో తీర్చిదిద్దాలనుకుంది. బియ్యప్పిండి, బంగాళా దుంపతో 100 (ఏ4 సైజు) వేఫర్‌ పేపర్లను చేసింది. అవన్నీ కలిపి 18 అడుగుల చీరగా మలచింది. కేకులపై డెకరేషన్‌కు ఉపయోగించే గోల్డ్‌ లస్టర్‌ డస్ట్‌ను బోర్డర్‌ కోసం వాడింది. ఈ చీర కోసం వారం రోజులు కష్టపడింది. ఖర్చు రూ.30 వేల వరకూ అయ్యిందట. 2 కేజీల బరువున్న ఈ చీరను కట్టుకుని, తర్వాత దాన్ని తింటున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. అది చూసి చాలామంది తమకూ అలాంటి చీర చేసివ్వమని పోస్టులు పెడుతున్నారు. సమయం దొరికీ, ఇంకా తక్కువ ఖర్చుతో చేయగలిగినప్పుడు అందరికీ అందుబాటులోకి తెస్తానంటోంది. అందువల్ల మీరూ ఆ చీరను తినాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే!
 



మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని