ప్రతి లెక్కా  పక్కాగా ఉండేలా...
close
Published : 12/03/2021 14:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రతి లెక్కా  పక్కాగా ఉండేలా...

పిల్లలను ముద్దు చేసే క్రమంలో తల్లిదండ్రులు వారు అడిగిందల్లా కొనిస్తారు. కొందరైతే లెక్కలు అడగకుండానే కోరిన డబ్బులు ఇచ్చేస్తుంటారు. ఇలా డబ్బు, పొదుపు విలువ తెలియకుండా పెంచితే భవిష్యత్తులో ఇబ్బందే. మరేం చేయాలి అంటారా?
చిన్నప్పుడు మనకి....తాతయ్య, అమ్మమ్మ, పెద్దమ్మ...ఇలా బంధువులు ఇచ్చిన డబ్బుల్ని డిబ్బీలో దాచుకునేవాళ్లం కదా! ఇప్పుడు అదే అలవాటుని మీ చిన్నారికీ చేయండి. తనకి ఎవరు ఏ కారణంతో డబ్బులు ఇచ్చినా...అందులో కనీసం పదిహేను శాతం పొదుపు చేయాలనే నియమం పెట్టండి. ఇందుకోసం చిన్నపిల్లలైతే వారు మెచ్చే డిజైన్‌లో ఓ కిడ్డీబ్యాంక్‌ కొనివ్వండి. టీనేజర్స్‌ అయితే...పోస్టాఫీసులో పొదుపుఖాతా తెరిపించండి. అప్పుడు వారికి ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది.
* పిల్లలకు తల్లిదండ్రులే ఆదర్శం. డబ్బు- పొదుపు విషయంలో మీరు కచ్చితంగా ఉండండి. నెల ప్రారంభంలో ఆర్భాటాలకు పోయి ఉన్న డబ్బంతా ఖర్చుచేసి నెల చివరల్లో దంపతులిద్దరూ కీచులాడుకోవద్దు. ఈ అలవాటు పసిపిల్లలపై ప్రతికూలంగా ప్రభావం చూపించే ప్రమాదం ఉంది. ఖర్చులు అదుపు తప్పుతున్నప్పుడు సర్దుబాట్లూ వారికి తెలిసేలా చేయండి. అప్పుడు డబ్బు విలువ అర్థం చేసుకోగలరు. అలానే వారి దగ్గర రూపాయి ఉన్నా సరే! దాన్ని వినియోగించిన విధానం తప్పనిసరిగా పుస్తకంలో రాసుకోమనండి. ఇలా వారి లెక్కలో స్పష్టత ఉంటే ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది.
* పిల్లలకు డబ్బులు ఇచ్చి వదిలేయడం కాదు...వారు సరిగానే ఖర్చుపెడుతున్నారో లేదో గమనిచండి. వారికి లాభనష్టాల తేడాలు, లావాదేవీల వివరాలు తెలిసేలా చేయండి. అలానే కోరుకున్న వస్తువుని సంపాదించుకోవాలంటే ఎంత కష్టపడాలో వారికి అర్థమయ్యేలా చెప్పాలి.


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని